Shashi Tharoor : రాహుల్ గాంధీపై శశి థరూర్ కామెంట్స్
అగ్ర నాయకుడి కామెంట్స్ అర్థరహితం
Shashi Tharoor : గాంధీ ఫ్యామిలీని మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్న జీ23 గ్రూప్ లో కీలక సభ్యుడిగా ఉన్నారు కేరళకు చెందిన ఎంపీ శశి థరూర్ . నవ్ సంకల్ప్ చింతిన్ శివర్ లో భాగంగా రాహుల్ గాంధీ ప్రాంతీయ పార్టీలపై చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని స్పష్టం చేశారు.
ఒక రకంగా ఆయన కామెంట్స్ ను ఖండించారు. జాతీయ పార్టీలకు విశాల దృక్ఫథం ఉంటుందని, మిగతా ప్రాంతీయ పార్టీలకు ఉండదని ఎలా అనుకోగలమని ప్రశ్నించారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడాలన్నా లేదా ఆక్టోపస్ లాగా అల్లుకు పోయిన భారతీయ జనతా పార్టీని ఢీకొనాలంటే తప్పనిసరిగా ఆయా రాష్ట్రాలలో బలంగా ఉన్న పార్టీలతో కలుపు కోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు శశి థరూర్ (Shashi Tharoor).
కొన్ని ప్రాంతీయ పార్టీలకు సిద్దాలంటూ లేవని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది పార్టీకి చేటు చేయడం తప్ప మరొకటి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి జార్ఖండ్ లో జార్ఖండ్ ముక్తి మోర్చా, బీహార్ లో రాష్ట్రీయ జనతాదళ్ ఉన్నాయి.
ఆయా పార్టీలు ఆ పార్టీని నిలదీశాయి. ఇక ఇప్పటి దాకా స్నేహంగా ఉంటూ విడి పోయిన జనతాదళ్ సెక్యులర్ నేత, మాజీ సీఎం హెచ్ డి కుమార స్వామి రాహుల్ గాంధీని ఎగతాళి చేయడం విశేషం.
ప్రాంతీయ పార్టీలు బీజేపీని ఓడించ లేవని కాంగ్రెస్ ఒక్కటే ఆ పని చేయగలదన్నారు రాహుల్ గాంధీ. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు శశి థరూర్(Shashi Tharoor) .
Also Read : చిదంబరంకు షాక్ సీబీఐ సోదాలు