AP Rajyasabha Candidates : ఏపీలో రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
అనూహ్యంగా కృష్ణయ్యకు చాన్స్
AP Rajyasabha Candidates : ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేశారు. నలుగురిని ఎంపిక చేశారు. వీరిలో మరోసారి విజయ సాయి రెడ్డికి అవకాశం ఇచ్చారు.
కాగా బహుజనుల సమస్యలను ప్రస్తావించడంలో అందరికంటే ముందంజలో ఉన్న తెలంగాణకు చెందిన బీసీ లీడర్ ఆర్. కృష్ణయ్యకు రాజ్యసభ చాన్స్(AP Rajyasabha Candidates) ఇచ్చారు. ప్రస్తుతం సీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో బహుజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వీరిద్దరితో పాటు నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావు పేర్లను ఖరారు చేశారు జగన్ రెడ్డి. వీరి ఎంపిక విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ(AP Rajyasabha Candidates) ప్రకటించారు.
కాగా ఆర్. కృష్ణయ్యను ఎందుకు ఎంపిక చేశారన్న దానికి క్లారిటీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఎంపిక ఎక్కడా జరగలేదన్నారు. ఇదో అరుదైన ఘట్టమని పేర్కొన్నారు సజ్జల.
నలుగురిని రాజ్యసభ అభ్యర్థులను నామినేట్ చేస్తే ఇద్దరు బీసీలు ఉన్నారని తెలిపారు. గత రాజ్యసభ ఎన్నికల్లోనూ తాము బీసీలకు చాన్స్ ఇచ్చామన్నారు. ఒకరు మోపిదేవి వెంకట రమణ కాగా మరొకరు పిల్లి సుభాష్ చంద్ర బోస్ అని గుర్తు చేశారు సజ్జల.
కృష్ణయ్య తెలంగాణాకు చెందిన వ్యక్తి మాత్రమే కాదని ఉమ్మడి ఏపీకి చెందిన బహుజనులకు చెందిన నాయకుడని స్పష్టం చేశారు. బీసలకు ఆర్. కృష్ణయ్య ఓ సింబల్ అని కితాబు ఇచ్చారు.
బీసీ కులాలన్నింటిని ఒకే తాటిపైకి తీసుకు వచ్చారన్నారు. జాతీయ స్థాయిలో సైతం వాయిస్ వినిపించారని చెప్పారు.
Also Read : పీఆర్సీ అమలుపై ఏపీ సర్కార్ జీఓ జారీ