YS Jagan : దావోస్ కు బయలు దేరిన జగన్
గన్నవరం నుంచి ప్రయాణం
YS Jagan : ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. శుక్రవారం రాత్రికి ఆయన దావోస్ కు చేరుకుంటారు. ఈనెల 22 నుంచి జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరమ్ లో సీఎం పాల్గొంటారు.
ఈ సందర్భంగా ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పరిపాలన తీరు, తదితర అంశాలపై ప్రసంగిస్తారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్ కేంద్రంగా పలువురితో భేటీ అవుతారు.
ఈ సందర్భంగా ఏపీలో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఐటీ, పారిశ్రామిక పాలసీ గురించి వివరిస్తారు ఏపీ సీఎం జగన్ రెడ్డి(YS Jagan). ఇందులో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక వేత్తలతో సమావేశం కానున్నారు.
రాష్ట్రంలోని విశాఖ, కాకినాడ, కృష్ణపట్నంతో పాటు రాష్ట్రంలో నిర్మిస్తున్న పోర్టులు, మూడు ఎయిర్ పోర్టుల అభివృద్ధి గురించి కూడా సీఎం వివరిస్తారు.
మరో వైపు బెంగళూరు – హైదరాబాద్, చెన్నై – బెంగళూరు, విశాఖపట్నం – చెన్నై కారిడార్లలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా వివరిస్తారు సీఎం(YS Jagan).
ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కంపెనీలు, సంస్థలు, వ్యాపారవేత్తలు, కుబేరులు, ఆయా సంస్థల చైర్మన్లు, సిఇఓలు, మేనేజింగ్ డైరెక్టర్లు, ఆర్థిక వేత్తలు, మేధావులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
ఇదిలా ఉండగా కరోనా కష్ట కాలంలో కూడా ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి కూడా వివరిస్తారు. కాగా ఏపీ సీఎం జగన్ వెంట ఉన్నతాధికారులు ఉన్నారు. వారు ఆయనతో పాటు భేటీలో పాల్గొంటారు.
Also Read : దేశ వ్యాప్తంగా కేసీఆర్ టూర్