Hardik Patel : అదానీ..అంబానీని టార్గెట్ చేస్తే ఎలా

గుజరాతీల‌ను విమ‌ర్శిస్తే ఓట్లు రావు

Hardik Patel : గుజ‌రాత్ లో బ‌ల‌మైన పాటిదార్ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు, ఇటీవ‌లే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వికి రాజీనామా చేసిన హార్దిక్(Hardik Patel)  ప‌టేల్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న ప్ర‌ధానంగా కాంగ్రెస్ పార్టీని ల‌క్ష్యంగా చేసుకుని నిప్పులు చెరుగుతున్నారు.

శుక్ర‌వారం హార్దిక్ ప‌టేల్ ప్ర‌ముఖ భార‌తీయ వ్యాపార‌వేత్త‌లు అనిల్ అంబానీ, గౌత‌మ్ అదానీల‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. ఒక వ్యాపార‌వేత్త క‌ష్టం వ‌ల్ల పైకి ఎదుగుతాడు.

ప్ర‌తిసారి మీరు అదానీని లేదా అంబానీని దుర్భాష లాడ‌టం ఎంత వ‌ర‌కు సమంజ‌సం అని ప్ర‌శ్నించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గుజ‌రాత్ కు చెందినంత మాత్రాన వ్యాపార‌వేత్త‌ల‌ను విమ‌ర్శించాల‌ని ఏమైనా రూల్ ఉందా అని హార్దిక్ ప‌టేల్ ప్ర‌శ్నించారు.

కాంగ్రెస్ పార్టీలో చేరి తాను త‌ప్పు చేశాన‌ని అన్నారు. ఒక ర‌కంగా చెప్పాలంటే తాను మూడేళ్ల విలువైన కాలాన్ని కోల్పోయాన‌ని పేర్కొన్నారు. పాటిదార్ ల‌కు న్యాయం చేసేంత వ‌ర‌కు తాను పోరాడుతూనే ఉంటాన‌ని ప్ర‌క‌టించారు హార్దిక్ ప‌టేల్.

రాష్ట్ర ఎన్నిక‌లకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడిన ప‌టేల్ గాంధీ ఫ్యామిలీని ల‌క్ష్యంగా చేసుకున్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేర‌క పోయి ఉండి ఉంటే గుజ‌రాత్ రాష్ట్రం కోసం మ‌రింత మెరుగ్గా ప‌ని చేసి ఉండే వాడిన‌ని చెప్పారు.

పార్టీలో ఉన్న‌ప్పుడు ప‌ని చేసే అవ‌కాశం రాలేద‌న్నాడు. ఎలాంటి పని చేయ‌మ‌ని చెప్ప‌లేద‌ని, పైపెచ్చు ఇబ్బందుల‌కు గురి చేసింద‌ని ఆరోపించాడు హార్దిక్ ప‌టేల్.

రాహుల్ గాంధీపై నిప్పులు చెరుగుతూ వ‌చ్చారు ప‌టేల్.

Also Read : కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీజేఐ

Leave A Reply

Your Email Id will not be published!