Sidhu : కోర్టులో లొంగి పోయిన సిద్దూ జైలుకు
నాటకీయ పరిణామాల మధ్య చెరసాలకు
Sidhu : సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్, మాజీ క్రికెటర్, ప్రముఖ ప్రయోక్తగా పేరొందిన నవ జ్యోత్ సింగ్ సిద్దూ కు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష విధించింది.
ఈ మేరకు తనకు కొంత గడువు కావాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు సిద్దూ. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరించింది కోర్టు. 1988 రోడ్ రేజ్ కేసులో శిక్ష విధించింది కోర్టు.
నాటకీయ పరిణామాల మధ్య భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం లొంగి పోవాల్సిందేనంటూ స్పష్టమైన తీర్పు చెప్పింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సిద్దూ పాటియాలా కోర్టులో లొంగి పోయారు.
దీంతో కోర్టు ఆదేశాల మేరకు శిక్షను అనుభవించేందుకు సిద్దూ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) అమిత్ మల్హన్ ముందు లొంగి పోయారు. మూడేళ్ల కిందట రూ. 1000 జరిమానాతో విడిచి పెట్టినా బాధిత కుటుంబీకులు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీంతో సీజేఐ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. శిక్ష ఖరారు చేసింది. సిద్దూ(Sidhu) సాయంత్రం 4 గంటలకు న్యాయ స్థానంకు వెళ్లారు. నేరారోపణ వారెంట్ పై సంతకం చేసి , మాతా కౌశైల ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేపట్టారు సిద్దూకు.
దీంతో న్యాయమూర్తి పాటియాలా సెంట్రల్ జైలుకు పంపాలని సిద్దూను ఆదేశించారు. 58 ఏళ్ల సిద్దూ ఆపరేషన్ చేయించుకున్నారని , మందులు వాడుతున్నారని , గోధుమ పిండిని చేర్చకుండా ప్రత్యేక ఆహారం తీసుకోవాలని ఆయన తరపు న్యాయవాది సూచించారు.
అదంతా జైలు అధికారులు చూసుకుంటారని కోర్టు స్పష్టం చేసింది.
Also Read : టైం కావాలన్న సిద్దూ కుదరదన్న కోర్టు