Australian PM : ఆస్ట్రేలియా ఎన్నిక‌ల్లో మారిస‌న్ ఓట‌మి

ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు ఆంథోనీకి అభినంద‌న

Australian PM : అంతా ఊహించిన‌ట్లుగానే ఆస్ట్రేలియా ప్ర‌ధాన‌మంత్రి స్కాట్ మారిస‌న్ కు (Australian PM) బి గ్ షాక్ త‌గిలింది. ఆసిస్ లో జ‌రిగిన ఎన్నిక‌ల ఓట‌మిని స్వ‌యంగా అంగీక‌రించారు.

నేను ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, దేశానికి కాబోయే ప్ర‌ధాన మంత్రి ఆంథోనీ అల్బ‌నీస్ (Australian PM) తో మాట్లాడాను. ఈ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యాన్ని సాధించినందుకు ప్ర‌త్యేకంగా అభినందించాన‌ని చెప్పారు.

ఇదిలా ఉండ‌గా ఆస్ట్రేలియా పాల‌క ప్ర‌భుత్వం త‌గిన‌న్ని సీట్లు గెలుచు కోలేక పోయింది. త‌న పార్టీ ప‌ట్ల ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పు ప‌ట్ల కొన్ని గంట‌ల త‌ర్వాత ఆస్ట్రేలియా సంప్ర‌దాయ‌వాద ప్ర‌ధాన మంత్రి స్కాట్ మారిస‌న్ శ‌నివారం ఎన్నిక‌ల ఓట‌మిని అంగీక‌రించ‌డం విశేషం.

గ‌త ద‌శాబ్ద కాలంగా ఆస్ట్రేలియాను ప‌రిపాలిస్తున్న త‌న లిబ‌ర‌ల్ పార్టీకి క‌ష్ట‌మైన తీర్పుగా పేర్కొన్నారు మారిస‌న్ సిడ్నీలో త‌న మ‌ద్ద‌తుదారుల‌తో క‌లిసి. దాదాపు స‌గం ఓట్లు లెక్కించారు.

ఒక‌ప్పుడు సుర‌క్షిత‌మైన సాంప్ర‌దాయ‌క ప‌ట్ట‌ణ స్థానాల‌లో మోరిస‌న్ లిబ‌ర‌ల్స్ ఓడి పోవ‌డం విస్తు పోయేలా చేసింది. టీల్స్ అని పిలిచే ఎక్కువ‌గా అధిక అర్హ‌త క‌లిగిన మ‌హిళ‌లు, ప‌ర్యావ‌ర‌ణ అనుకూల‌, అవినీతి వ్య‌తిరేక‌, లింగ స‌మాన‌త్వ అనుకూల టికెట్ల‌పై పోటీ చేశారు.

క‌రోనా మ‌హ‌మ్మారి, క‌ర‌వు, వ‌ర‌ద‌లు ల‌క్ష‌లాది మంది ఆస్ట్రేలియ‌న్ల జీవితాన్ని అత‌లాకుత‌లం చేశాయి. మూడు ఏళ్ల త‌ర్వాత విజ‌యం వ‌రించింద‌న్నారు ఆస్ట్రేలియ‌న్ గ్రీన్స్ నాయ‌కుడు ఆడ‌మ్ బాండ్ట్ అన్నారు.

సిడ్నీ ప‌బ్లిక్ హౌసింగ్ లో నివ‌సిస్తున్న ఒంట‌రి త‌ల్లి కొడుకు నుండి దేశంలోని అత్యున్న‌త కార్యాల‌యానికి చేరుకోవ‌డం వ‌ర‌కు త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌యాణాన్ని ప్ర‌తిబింబిస్తూ అల్బ‌నీస్ కు స్పంద‌న ల‌భించింది.

Also Read : అమ్మ‌కానికి శ్రీ‌లంక ఎయిర్ పోర్ట్ సిద్దం

Leave A Reply

Your Email Id will not be published!