Yuzvendra Chahal : షేన్ వార్న్ కి చాహ‌ల్ నివాళి

ఆయ‌న ఆశీస్సులు ఉంటాయి

Yuzvendra Chahal : యుజ్వేంద్ర చాహ‌ల్ అద్భుత‌మైన బౌల‌ర్. భార‌త జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాడు. తాజాగా ఐపీఎల్ 2022లో స‌త్తా చాటాడు. ఏకంగా 26 వికెట్లు తీశాడు. టోర్న‌లో ప‌ర్పుల్ క్యాప్ రేసులో ఉన్నాడు.

మంగ‌ళ‌వారం కోల్ క‌తా ఈడెన్ గార్డెన్ వేదిక‌గా మొద‌టి క్వాలిఫ‌య‌ర్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్భంగా రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కు మొట్ట మొద‌టిసారిగా ఐపీఎల్ టైటిల్ తీసుకు వ‌చ్చాడు ఆసిస్ మాజీ దివంగ‌త క్రికెట్ దిగ్గ‌జం షేన్ వార్న్.

వార్న్ ఆశీస్సులు త‌న‌కు ఎల్ల‌ప్ప‌టికీ ఉంటాయ‌న్నాడు చాహ‌ల్. షేన్ వార్న్ ను ఈ సంద‌ర్భంగా మ‌రోసారి గుర్తు చేసుకున్నాడు చాహ‌ల్(Yuzvendra Chahal). అత‌డి ఆశీర్వాదాలు ఎల్ల‌ప్ప‌టికీ త‌న‌కు ఉంటాయ‌ని పేర్కొన్నాడు.

ప్ర‌తి సంద‌ర్భంలోను వార్న్ గుర్తుకు వ‌స్తాడ‌ని తెలిపాడు. ఈ ఏడాది మార్చిలో షేన్ వార్న్ అకాల మ‌ర‌ణం చెందాడు. యావ‌త్ క్రీడా లోకం దిగ్భ్రాంతికి లోనైంది. ఈ లెగ్ స్పిన్ మాంత్రికుడు లేడ‌న్న నిజాన్ని ఇంకా జీర్ణించు కోలేక పోతున్నారు.

ఇదే స‌మ‌యంలో సైమండ్స్ కూడా రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌డం ఆస్ట్రేలియా క్రికెట్ కు ఒక ర‌కంగా పెద్ద దెబ్బ‌. ఇక షేన్ వార్న్ ను తలుచుకుంటూ క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాడు యుజ్వేంద్ర చ‌హ‌ల్.

ఇదే చాహ‌ల్(Yuzvendra Chahal)  కు మొద‌టి సీజ‌న్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో ఆడ‌డం. కానీ నాకు చాలా సంవ‌త్స‌రాలుగా జ‌ట్టుతో ఆడుతున్న‌ట్లుగా ఉంద‌న్నాడు చాహ‌ల్. ఇది కుటుంబంలాగా ఉంది.

చాలా మాన‌సికంగా, ఆరోగ్య‌క‌రంగా ఉన్నాన‌ని తెలిపాడు . వారు నన్ను గౌర‌వించే , ప్రేమించే విధానం బాగుంద‌న్నాడు. షేన్ వార్న్ లేక పోయినా ఆయ‌న ఆశీర్వాదం నాకుంద‌న్నాడు.

Also Read : బీసీసీఐ సెలెక్ట‌ర్ల‌పై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!