Sajjala Ramakrishna Reddy : జిల్లా మార్పుపై రాద్ధాంతం ఎందుకు
కోనసీమ ఉద్రిక్తతలపై సజ్జల రామకృష్ణా రెడ్డి
Sajjala Ramakrishna Reddy : మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పంటించడం, కోనసీమ జిల్లా పేరు మార్చాలని ఆందోళనలు మిన్నంటడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy) స్పందించారు. భారత దేశం గర్వించదగిన మహానుభావుడు,
భారత రాజ్యాంగ నిర్మాత, రచయిత, సామాజికవేత్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు కోనసీమ జిల్లాకు పేరు పెట్టామని చెప్పారు. మంగళవారం సజ్జల మీడియాతో మాట్లాడారు.
అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని, అన్నింటిని పరిశీలించి కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం జరిగిందని స్పష్టం చేశారు. మరి ఎందుకు ఆందోళనలు చేయాల్సి వచ్చిందో అర్థం కావడం లేదన్నారు.
జిల్లాల విభజన సందర్భంగా ఆ జిల్లాకు అంబేద్కర్ పెట్టాలంటూ ప్రధానంగా డిమాండ్లు వచ్చాయని, దీంతో జిల్లాల పునర్వభిజన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని తెలిపారు.
అన్నింటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత కమిటీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందు ఉంచడం జరిగిందన్నారు. ప్రస్తుత ఘటన వెనుక ఏ శక్తులు ఉన్నాయనేది జనానికి తెలుసన్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ జిల్లా పేరు మార్పు నిర్ణయాన్ని అన్ని పార్టీలు ఒప్పుకున్నాయని చెప్పారు సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy). ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే అంబేద్కర్ గురించి ప్రపంచానికి మహా నేత అని తెలుసు.
ఆయన భరత మాత బిడ్డ. దానికి దురుద్దేశాలు ప్రేరేపించే శక్తులు కూడా ఉండొచ్చంటూ అనుమానం వ్యక్తం చేశారు సజ్జల. రెచ్చ గొట్టడం మంచి పద్దతి కాదన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి.
Also Read : ఇంధన రంగంలో పెట్టుబడుల వెల్లువ