Kapil Sibal : కాంగ్రెస్ కు గుడ్ బై రాజ్య‌స‌భ‌కు పోటీ

ఎస్పీ మ‌ద్ద‌తుతో ఇండిపెండెంట్ గా

Kapil Sibal : అంతా అనుకున్న‌ట్టుగానే జ‌రిగింది. గ‌త కొంత కాలం నుంచీ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు క‌పిల్ సిబల్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తూ వ‌చ్చారు. కాగా సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీలో ఆయ‌న సీనియ‌ర్ నేత‌.

అపార‌మైన అనుభ‌వం ఉన్న నాయ‌కుడు. అంతే కాదు మంచి వాగ్ధాటి, మేథ‌స్సు క‌లిగిన న్యాయ‌వాది. సుప్రీంకోర్టులో క‌పిల్ సిబ‌ల్ లేవ‌దీసే ప్ర‌శ్న‌లకు చాలా ప్రాధాన్య‌త ఉంది.

ఎన్నో కేసులు గెలిపించిన ఘ‌న‌త ఆయ‌న‌కే ద‌క్కుతుంది. కాగా గాంధీ ఫ్యామిలీ నాయ‌క‌త్వాన్ని క‌పిల్ సిబల్(Kapil Sibal)  మొద‌టి నుంచీ ప్ర‌శ్నిస్తూ, నిల‌దీస్తూ వ‌స్తున్నారు. ఆ పార్టీలో అస‌మ్మ‌తి నాయ‌కులంతా క‌లిసి జీ23 అని స‌ద‌స్సు ఏర్పాటు చేశారు.

అందులో కీల‌క‌మైన నాయ‌కుడు క‌పిల్ సిబల్. ఇక తాజాగా రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ లో జ‌రిగిన న‌వ సంక‌ల్ప్ చింత‌న్ శివిర్ కు గైర్హాజ‌ర్ అయ్యారు. కాగా అస‌మ్మ‌తి నేత‌లు గులాం న‌బీ ఆజాద్,

శ‌శి థ‌రూర్ , ఆనంద్ శ‌ర్మ పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయ‌క‌త్వాన్ని , సంస్థ‌ను పూర్తిగా స‌వ‌రించాల‌ని క‌పిల్ సిబ‌ల్ బ‌హిరంగంగా పిలుపునిచ్చారు. క‌పిల్ సిబ‌ల్ రాసిన లేఖ క‌ల‌క‌లం రేపింది.

కానీ సోనియా గాంధీ చివ‌రి దాకా వేచి చూసే ధోర‌ణి అవ‌లంభించింది. ఇక బుధ‌వారం అఖిలేష్ యాద‌వ్ చీఫ్ గా ఉన్న స‌మాజ్ వాది పార్టీ మ‌ద్దతుతో ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా రాజ్య‌స‌భ‌కు క‌పిల్ సిబ‌ల్(Kapil Sibal)  నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

ఆ కొద్ది సేప‌టికే తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో మ‌రో సీనియ‌ర్ నేతను కోల్పోయింది ఆ పార్టీ. ఇక నుంచి నేను కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్య‌క్తిని కాను.

ఇక నుంచి స్వ‌తంత్రంగానే స్వ‌రాన్ని వినిపిస్తాన‌ని అన్నారు క‌పిల్ సిబ‌ల్.

Also Read : అఖిలేష్ యాద‌వ్ తో క‌పిల్ సిబ‌ల్ భేటీ

Leave A Reply

Your Email Id will not be published!