Yasin Malik : త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిస్తే ఉరి శిక్ష‌కు సిద్ధం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన యాసిన్ మాలిక్

Yasin Malik : నేను ఇప్ప‌టికీ స్ప‌ష్టం చేస్తున్నాను. నేను స‌త్యానికి నిల‌బ‌డ్డ వ్య‌క్తిని. నేను కోరుకున్న‌ది స్వేచ్ఛ‌తో కూడిన ప్రాంతాన్ని. భార‌త ఇంటెలిజెన్స్ వ్య‌వ‌స్థ తాను దేశ ద్రోహానికి పాల్ప‌డిన‌ట్లు నిరూపిస్తే , దానిని కోర్టు న‌మ్మితే..ఉరి శిక్ష విధిస్తే స్వీక‌రించేందుకు సిద్దంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశాడు కాశ్మీర్ వేర్పాటువాద నాయ‌కుడు యాసిన్ మాలిక్.

నాకు భార‌త దేశ న్యాయ వ్య‌వ‌స్థ ప‌ట్ల న‌మ్మ‌కం ఉంద‌న్నాడు. ఉగ్ర‌వాదుల‌కు నిధులు స‌మకూర్చిన కేసులో యాసిన్ మాలిక్(Yasin Malik) ను కోర్టు గ‌తంలో దోషిగా నిర్ధారించింది.

యాసిన్ మాలిక్ కు సంబంధించిన కేసు బుధ‌వారం విచార‌ణకు వ‌చ్చింది సుప్రీంకోర్టులో. ఈ సంద‌ర్భంగా యాసిన్ మాలిక్ కు మ‌ర‌ణ శిక్ష విధించాల‌ని జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టును కోరింది.

దీనిపై స్పందించిన యాసిన్ మాలిక్ తాను ఎవ‌రినీ అడ్డుకోన‌ని, అంత‌కంటే దేబ‌రించ‌మ‌ని కోర‌న‌ని చెప్పాడు. దీనిపై తుది నిర్ణ‌యం తీసుకోవాల్సింది, చివ‌రి తీర్పు వెలువ‌రించాల్సింది మాత్రం కోర్టేన‌ని పేర్కొన్నాడు మాలిక్.

నేను 28 ఏళ్ల‌లో ఏదైనా ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు లేదా హింస‌కు పాల్ప‌డి ఉంటే, భార‌తీ ఇంటెలిజెన్స్ ఈ విష‌యాన్ని రుజువు చేస్తే నేను కూడా రాజ‌కీయాల నుండి త‌ప్పుకుంటాన‌ని ప్ర‌క‌టించాడు యాసిన్ మాలిక్.

నేను ఏడుగురు ప్ర‌ధాన మంత్రుల‌తో క‌లిసి ప‌ని చేశాన‌ని చెప్పాడు. ఇదిలా ఉండ‌గా కాశ్మీరీ వ‌ల‌స‌ల‌కు యాసిన్ మాలిక్(Yasin Malik) బాధ్య‌త వ‌హిస్తార‌ని ఎన్ఐఏ స్పెష‌ల్ ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ కోర్టుకు తెలిపారు.

అత‌డికి మ‌ర‌ణ శిక్ష విధించాల‌ని కోరితే యాసిన్ మాలిక్ త‌ర‌పు న్యాయ‌వాది మాత్రం జీవిత ఖైదు విధించాల‌ని కోరారు.

Also Read : ఆర్థిక సంక్షోభం అంచున భార‌త్

Leave A Reply

Your Email Id will not be published!