Bhagwant Mann : సీఎం నిర్ణయం పంజాబ్ భాషకు పట్టం
50 మార్కులు తప్పనిసరి సీఎం
Bhagwant Mann : పంజాబ్ సీఎం భగవంత్ మాన్(Bhagwant Mann) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన అసాధారణ నిర్ణయాలు తీసుకుంటూ విస్తు పోయేలా చేస్తున్నారు.
ఒకే దేశం ఒకే భాష ఒకే పార్టీ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలపై ఆధిపత్యం చెలాయించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు సీఎం. ఈ తరుణంలో ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు బుధవారం అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రంలో ఎవరైనా సరే పంజాబ్ భాషకు ప్రయారిటీ ఇవ్వాలని కోరారు. అంతే కాదు మొదట పంజాబీ, ఆ తర్వాతే ఏ భాష అయినా అని స్పష్టం చేశారు.
మాతృ భాషను మరిచి పోకూడదని, అందుకే పంజాబ్ కు ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రకటంచారు. ప్రభుత్వ ఉద్యోగాల ఆప్టిట్యూడ్ పరీక్షలో మాతృ భాష పంజాబీని తప్పనిసరి చేశారు.
పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు రావాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పంజాబీలకు, పంజాబీ భాషకు ఎనలేని గుర్తింపు ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
పంజాబీ భాషను అన్ని రంగాలలో , అన్ని విభాగాలలో ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు భగవంత్ మాన్(Bhagwant Mann). ఇవాళ ప్రకటించిన సీఎం నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని మేధావులు, పంజాబీలు, కళాకారులు, మేధావులు, బుద్ది జీవులు, ఆలోచనాపరులు పేర్కొన్నారు.
భగవంత్ మాన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనంటూ వారు కితాబు ఇచ్చారు. పర భాషా మోజులో పడి మాతృ భాషను మరిచి పోతున్న తరుణంలో సీఎం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
ఒక రకంగా మాన్ నిర్ణయం కేంద్రానికి షాక్ తగిలేలా చేసింది.
Also Read : జయంత్ చౌదరికి షాక్ డింపుల్ కు ఛాన్స్