Anil Parab ED : మంత్రి అనిల్ పరబ్ ఇంట్లో ఈడీ సోదాలు
మహారాష్ట్ర సర్కార్ కు మరో షాక్
Anil Parab ED : మనీ లాండరింగ్ కు సంబంధించిన కేసులో మహారాష్ట్ర సర్కార్ కు మరోసారి ఝలక్ ఇచ్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).
ఇందులో భాగంగా మహా వికాస్ అగాఢీ (ఎంవీఏ) సంకీర్ణ సర్కార్ లో కేబినెట్ మంత్రిగా ఉన్న అనిల్ పరబ్(Anil Parab ED) నివాసంతో పాటు ఏడు ప్రదేశాలలో సోదాలు ముమ్మరం చేసింది ఈడీ.
మంత్రి పరబ్ ను ఇప్పటికే ఈడీ మనీఈ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ ప్రశ్నించింది. గురువారం ఈ మేరకు ఏక కాలంలో సోదాలు ముమ్మరం చేసింది.
భూ ఒప్పందంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మనీ లాండరింగ్ విచారణలో భాగంగా మహారాష్ట్రలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్న అనిల్ పరబ్ కు సంబఃధించిన పలు ప్రాంతాల్లో ఈడీ ఇవాళ ఉదయం దాడులు చేపట్టింది.
మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) లోని క్రిమినల్ సెక్షన్ కింద శివసేన నాయకుడిపై దర్యాప్తు సంస్థ తాజాగా కేసు నమోదు చేసింది. అనంతరం అనిల్ పరబ్ నివాసంతో పాటు పుణె, ముంబై, దాపోలిని 7 ప్రదేశాలలో ఈడీ దాడులు చేసింది.
ఈ మేరకు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తోంది. అనిల్ పరబ్(Anil Parab ED) 2017లో రత్నగిరి జిల్లాలోని దాపోలో రూ. 1 కోటికి భూమిని కొనుగోలు చేశారని, అది 2019 లో నమోదైందన్న ఆరోపణలకు సంబంధించి అనిల్ పరబ్ పై ఈడీ కేసు నమోదు చేసింది.
ఆ భూమిని ముంబైకి చెందిన కేబుల్ ఆపరేటర్ సదానంద్ కదమ్ కు 2020లో రూ. 1.10 కోట్లకు విక్రయించారని, 2017-20 మధ్య కాలంలో ఆ స్థలంలో రిసార్ట్ ను నిర్మించారని ఆరోపించింది ఈడీ.
రిసార్ట్ నిర్మాణం 2017లో ప్రారంభమైందని, రూ. 6 కోట్లకు పైగా ఖర్చు చేశారని ఆదాయ పన్ను శాఖ ఆరోపించింది.
Also Read : సీఎం నిర్ణయం పంజాబ్ భాషకు పట్టం