Kapil Sibal : వాళ్లు తమ గురించి ఆలోచిస్తే బెటర్
సంచలన కామెంట్స్ చసిన కపిల్ సిబల్
Kapil Sibal : సుదీర్ఘ కాలం పాటు పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీని వీడాక సంచలన కామెంట్స్ చేశారు. ఆ పార్టీ ప్రస్తుతం అంపశయ్యపై ఉందన్నారు. దానిని ఎవరూ కాపాడ లేరన్నారు.
పార్టీలో ఉన్న వారంతా కనీసం తమ గురించి, తమ భవిష్యత్తు గురించి ఆలోచించు కోవాలని స్పష్టం చేశారు. నాయకత్వంలో కానీ, పార్టీ సంస్థాగత పరంగా కానీ మార్పులు చేపట్టక పోతే ఈ పార్టే కాదు ఏ పార్టీ అయినా పతనం కాక తప్పదని జోష్యం చెప్పారు.
ప్రస్తుతం తాను సర్వ స్వతంత్రుడినని , తాను ఎవరికీ సంజాయిషీ ఇచ్చు కోవాల్సిన అవసరం లేదన్నారు కపిల్ సిబల్(Kapil Sibal). తాను ఎన్నో కేసులు వాదించాను. ఎంతో అనుభవం గడించాను.
ఇక నుంచి సర్వ స్వతంత్రంగా నా వాణిని ప్రజల తరపున వినిపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. నేను ఏ పార్టీకి వంత పాడదల్చు కోవడం లేదని స్పష్టం చేశారు కపిల్ సిబల్.
ఆయన కాంగ్రెస్ పార్టీని వీడడం చారిత్రిక అవసరంగా పేర్కొన్నారు. కపిల్ పార్టీకి గుడ్ బై చెప్పి సమాజ్ వాది పార్టీ మద్దతుతో ఇండిపెండ్ గా రాజ్యసభ తరపున నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు ఎందరో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వీడేందుకు సిద్దంగా ఉన్నారని జోష్యం చెప్పారు. ప్రజల నుంచి దూరం కావడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ అన్నారు.
తాను ఇంకేమీ వ్యాఖ్యానించ దల్చు కోలేదన్నారు. కాలం విలువైనదని దానిని ఎక్కువ సమయం రాజ్యసభలో కేటాయించేందుకు వినియోగిస్తానని చెప్పారు కపిల్ సిబల్(Kapil Sibal).
Also Read : సోషల్ మీడియా స్టార్ కాల్చివేత