Supriya Sule : పాటిల్ కామెంట్స్ సుప్రియా సీరియస్
బీజేపీ నేతల దిగజారుడు వ్యాఖ్యలు
Supriya Sule : మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలేపై వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపాయి. మహారాష్ట్రలో ఓబీసీ రిజర్వేషన్లపై బీజేపీ, ఎన్సీపీ పార్టీలు ఒకరిపై మరొకరు తీవ్ర వ్యాఖ్యలు చేశాయి.
పాటిల్ సుప్రియాను టార్గెట్ చేశారు. రాజకీయాలు అర్థం కాక పోతే ఇంటికి వెళ్లి వంట చేసుకో అంటూ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
భారతీయ సంస్కృతి, సంప్రదాయం, నాగరికత అంటూ నిత్యం నీతులు వల్లించే బీజేపీ రాష్ట్ర చీఫ్ ఇలా మహిళల ను కించపరిచేలా మాట్లాడటం ఎంత వరకు సబబు అంటూ మండిపడుతున్నారు.
మహిళా సంఘాల నాయకులు తీవ్ర స్థాయిలో తప్పు పట్టారు చంద్రకాంత్ పాటిల్ ను. ఓబీసీ కోటా కోసం మహారాష్ట్ర చేస్తున్న పోరాటాన్ని మధ్య ప్రదేశ్ తో పోల్చిన సుప్రియా సూలేపై బీజేపీ నాయకుడు రెచ్చి పోవడాన్ని తప్పు పట్టారు.
స్థానిక ఎన్నికల్లో కోటా కోసం బీజేపీ పాలిత రాష్ట్రానికి సుప్రీంకోర్టు నుంచి ఎలా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ప్రశ్నించారు.
మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్ తో అధికారాన్ని పంచుకుంటున్న సూలే ఎంపీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ను ఢిల్లీ టూర్ లో సంప్రదించారని తెలిపారు.
కాగా ఉపశమనం పొందేందుకు ఆయన ఏం చేశాడో ఎవరికీ చెప్పలేదన్నారు సుప్రియా సూలే(Supriya Sule). ఢిల్లీలో ఏం చేశారో తెలియదు. కానీ ఓబీసీ రిజర్వేషన్ల కోసం ముందుకు సాగారని ఆరోపించారు.
Also Read : జే షా ఎవరో ప్రధాని మోదీ చెప్పాలి