KS Eshwarappa : కేఎస్ ఈశ్వరప్ప సంచలన కామెంట్స్
మసీదుల్లో మందిరాలు కట్టి తీరుతాం
KS Eshwarappa : మాజీ కర్ణాటక డిప్యూటీ సీఎం , భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప(KS Eshwarappa) సంచలన వ్యాఖ్యలు చేశారు. మసీదులపై కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.
ఇప్పటికే మందిర్ – మసీద్ వ్యవహారంపై భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానంలో కేసు నడుస్తోంది. ఈ తరుణంలో కేఎస్ ఈశ్వరప్ప శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆలయాలను ధ్వంసం చేసి మసీదులు నిర్మించారు.
వాటిని గుర్తించి తిరిగి తాము మందిరాలను పునర్ నిర్మిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే హిజాబ్ వివాదంతో ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షించిన కర్ణాటక ఈ కామెంట్స్ తో మరోసారి వార్తల్లో నిలిచేలా చేశారు మాజీ డిప్యూటీ సీఎం.
36 వేల ఆలయాలను ధ్వంసం చేశారని, వాటిని ఆరు నూరైనా తిరిగి కట్టి తీరుతామని శపథం కూడా చేశారు కేఎస్ ఈశ్వరప్ప(KS Eshwarappa). ఎవరైనా సరే కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు.
ఈ విషయాన్ని భారత రాజ్యాంగం స్పష్టం చేసింది కూడా. మన దేశం భిన్న మతాలు, కులాలతో కూడుకుని ఉన్నది. ప్రధానంగా సత్య ప్రమాణం చేసి ప్రభుత్వంలో కొలువు తీరిన మాజీ డిప్యూటీ సీఎం ఇలాంటి చౌకబారు ప్రకటన ఎలా చేస్తారంటోంది విపక్షం.
ఇక ఈశ్వరప్ప అవును మా ఆలయాలను ధ్వంసం చేశారు. వాటిని తొలగించి మసీదులు కట్టారు. ఇంకెక్కడైనా మసీదులు కట్టుకోండి. నమాజులు చేసుకోండి.
ఆలయాల మీద మసీదులను అనుమతించే ప్రసక్తి లేదని కుండ బద్దలు కొట్టారు ఈశ్వరప్ప. తాము న్యాయ బద్దంగానే వాటిని స్వాధీనం చేసుకోవడం ఖాయమని జోస్యం కూడా చెప్పారు.
Also Read : ఆర్యన్ ఖాన్ కు ఎన్సీబీ లైన్ క్లియర్