Indigo Fined : ఇండిగో ఎయిర్ లైన్స్ కు రూ. 5 ల‌క్ష‌ల ఫైన్

అబ్బాయిని అనుమ‌తించినందుకు షాక్

Indigo Fined : ఇండిగో ఎయిర్ లైన్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసిఏ). ప్ర‌త్యేక అవ‌స‌రాలు క‌లిగి ఉన్న బాలుడిని రాంచీ విమానంలో ఎక్కించ‌కుండా ఇబ్బందుల‌కు గురి చేసినందుకు గాను ఇండిగో విమానాయ‌న సంస్థ‌కు రూ. 5 ల‌క్ష‌ల జ‌రిమానా(Indigo Fined)  విధించిన‌ట్లు డీజీసీఏ ప్ర‌క‌టించింది.

ఈ మేర‌కు శ‌నివారం అధికారిక ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేసింది. ఇండిగో గ్రౌండ్ స్టాఫ్ ప్రత్యేక పిల్ల‌ల నిర్వ‌హ‌ణ‌లో అమానుషంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు విచార‌ణలో తేలింద‌ని వెల్ల‌డించింది డీజీసీఏ.

ఇలాంటివి మ‌రోసారి పున‌రావృతం అయితే తాము ఊరుకోమంటూ తీవ్రంగా హెచ్చ‌రించింది. అంతే కాదు మిగ‌తా ఎయిర్ లైన్స్ ల‌కు కూడా వ‌ర్తిస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది డీజీసీఏ.

ప్ర‌యాణికుల ప‌ట్ల ముఖ్యంగా పిల్ల‌ల ప‌ట్ల ద‌యగా ఉండాలి. మ‌ర్యాద పూర్వ‌కంగా ప్ర‌వ‌ర్తించాలి. కానీ ప్ర‌త్యేకించి ప్ర‌త్యేక అవ‌స‌రాలు క‌లిగిన వారి ప‌ట్ల ఇంత దారుణంగా ఎలా ప్ర‌వ‌ర్తిస్తారంటూ తీవ్రంగా ప్ర‌శ్నించింది డీజీసీఏ.

దీనిని ఎట్టి ప‌రిస్థితుల్లో తాము ఒప్పుకునే ప్ర‌స‌క్తే లేద‌ని పేర్కొంది. పౌర విమాన‌యాన అవ‌స‌రాలు అత్యంత ప్రాధాన్య‌త సంత‌రిచుకుని ఉంటాయి. వీటిని అర్థం చేసుకోకుండా ప్ర‌వ‌ర్తిస్తే ఇలాంటివి పున‌రావృతం అవుతాయి.

ముఖ్యంగా బోర్డింగ్ విష‌యంలో ఆయా విమాన‌యాన సంస్థ‌లు చాలా జాగ్ర‌త్తగా ఉండాల‌ని సూచించింది. ఇండిగో(Indigo Fined)  విమాన‌యాన సంస్థ త‌మ సిబ్బందికి ప్ర‌యాణికుల ప‌ట్ల‌, చిన్నారుల ప‌ట్ల‌, ప్ర‌త్యేక అవ‌స‌రాలు క‌లిగిన వారి ప‌ట్ల‌, మ‌హిళలు, వృద్దుల ప‌ట్ల ఎలా న‌డుచు కోవాలో ప్ర‌త్యేకంగా ట్రైనింగ్ ఇవ్వాల‌ని సూచించింది.

దీని వ‌ల్ల వారి ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు వ‌స్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేసింది డీజీసీఏ. మే 7న రాంచీ – హైద‌రాబాద్ విమానంలో ప్ర‌యాణిస్తున్న మ‌నీషా గుప్తా అనే ప్ర‌యాణీకురాలు, పేరెంట్స్ కు ఎదురైన క‌ష్టాల‌ను వివ‌రించ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఇందుకు ఇండిగో వివ‌ర‌ణ కూడా ఇచ్చింది.

Also Read : క‌లిసి ప‌ని చేయ‌డం ముఖ్యం – సీఎం

Leave A Reply

Your Email Id will not be published!