Sidhu Moose Wala : సిద్దూ అంత్యక్రియలకు భారీ భద్రత
భద్రత తగ్గింపుపై రాజకీయ దుమారం
Sidhu Moose Wala : సింగర్ సిద్దూ అంత్యక్రియలు పంజాబ్ లోని ఆయన స్వగ్రామంలో జరగనున్నాయి. ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు.
కెనడాకు చెందిన గ్యాంగ్ స్టర్ ఈ దురాగతానికి పాల్పడినట్లు ప్రకటించడం సంచలనం కలిగించింది. ఇప్పటికే ఈ హత్య కేసులో ఆరుగురి కీలక నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సిద్దూ హత్యపై జ్యూడిషియల్ ఎంక్వయిరీకి ఆదేశించారు. కాగా సీఎం తీసుకున్న నిర్ణయంపై రాజకీయంగా దుమారం చెలరేగింది. 424 మంది ప్రముఖకులకు ఏర్పాటు చేసిన సెక్యూరిటీని తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో ఆయన ప్రకటించిన మరుసటి రోజే సిద్దూ(Sidhu Moose Wala) పై అటాక్ జరిగింది. ఇందులో 8 నుంచి 10 మంది సాయుధులైన
దుండగులు ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. 30 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు.
ఆపై చనిపోయాడా లేదా అని పరీక్షించాకే అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఇరు గ్యాంగ్ ల మధ్య జరిగిన గొడవల ఫలితంగానే ఈ హత్య జరిగినట్లు వెల్లడించారు.
సిద్దూ మూసే వాలా కుటుంబీకులు ఆయన మృతదేహాన్ని అంత్యక్రియల కోసం మాన్సా సివిల్ ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకు వెళ్లారు. పోస్ట్ మార్టంలో 24 బుల్లెట్లకు పైగా సిద్దూ బాడీలోనే ఉన్నాయని గుర్తించారు.
ఇదిలా ఉండగా సిద్దూ(Sidhu Moose Wala) హత్య తర్వాత పంజాబ్, హర్యానా హైకోర్టు భద్రత ఉపసంహరించు కోవడానికి గల కారణాలు ఏమిటనేది వివరణ ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ను విచారించడం ప్రారంభించారు.
హత్యకు బాధ్యత వహిస్తున్న కెనడాకు చెందిన గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ బిష్ణోయ్ కి సన్నిహితుడు. గ్యాంగ్ ల మధ్య గొడవల కారణంగానే సిద్దూ హత్య జరిగిందని పంజాబ్ పోలీస్ చీఫ్ వీకే భవ్రా వెల్లడించారు.
Also Read : ఆర్యన్ ఎఫెక్ట్ సమీర్ వాంఖెడేపై వేటు