Ashish Deshmukh : కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత గుడ్ బై
రాజ్యసభ సీట్ల ఎంపికలో అన్యాయం
Ashish Deshmukh : రాజ్యసభ సీట్ల ఎంపిక వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. అసమ్మతి రాగం వినిపించిన గులాం నబీ ఆజాద్ , ఆనంద్ శర్మలకు ఛాన్స్ దక్కుతుందని భావించారు. కానీ వారికి దక్కలేదు.
దేశంలోని 15 రాష్ట్రాలలో 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే 22 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.
ఇక కాంగ్రెస్ పార్టీని వీడుతున్న వారు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నాయకుల సంఖ్య పెరిగి పోయింది. స్థానిక నాయకులకు అవకాశం ఇవ్వకుండా ఇతరులను ఇక్కడ పోటీ చేయిస్తే ఎలా గెలుస్తారంటూ మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఆశిష్ దేశ్ ముఖ్(Ashish Deshmukh) ప్రశ్నించారు.
రాష్ట్రంలో బయటి వ్యక్తిని ఎంపిక చేయడాన్ని తప్పు పట్టారు. ఈ మేరకు ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీకి లేఖ రాశారు. మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
పార్టీ తీసుకున్న నిర్ణయం పూర్తిగా కార్యకర్తలు, నాయకులకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. ఇదే ఎంపికకు సంబంధించి 18 ఏళ్ల పాటు పార్టీలో ఉన్న సీనియర్ నటి నగ్మా కూడా తనకు ఏం అర్హత లేదని నిలదీసింది పార్టీ హైకమాండ్ ను.
పూర్తిగా పార్టీ ఆకాంక్షలకు, సిద్దాంతాలకు విరుద్దమంటూ ఆరోపించారు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో తనకు తెలియడం లేదన్నారు. ఇమ్రాన్ ప్రతాప్ గర్హి పేరును ప్రకటించడం ఆ పార్టీలో కలకలం రేపింది.
పార్టీకి సేవలు చేయకుండా మేనేజ్ చేస్తే ఎలా టికెట్ కేటాయిస్తారంటూ సంచలన ఆరోపణలు చేశారు దేశ్ ముఖ్(Ashish Deshmukh).
Also Read : ముస్లింలకు బీజేపీ రిక్త హస్తం