Sidhu Funeral : సింగర్ సిద్దూకు కన్నీటి వీడ్కోలు
తరలి వచ్చిన అశేష ప్రజానీకం
Sidhu Funeral : ప్రముఖ పంజాబ్ సింగర్ సిద్దూ మూసే వాలా అంత్యక్రియలు అశేష జన సందోహం మధ్య ముగిశాయి. సిద్దూ అమర్ రహే అంటూ నినాదాలు మిన్నంటాయి.
పంజాబ్ పాటల కెరటం ఇక పాడలేనంటూ వెళ్లి పోవడాన్ని గ్రామస్థులే కాదు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు జీర్ణించు కోలేక పోతున్నారు. సిద్దూ మూసే వాలాకు అత్యంత ఇష్టమైనది ట్రాక్టర్.
ఆ ట్రాక్టర్ లేకుండా పాటలు పాడే వాడు కాదు. ప్రతి పాటకు సంబంధించిన వీడియోలో ట్రాక్టర్ ఉండి తీరాల్సిందే. తాను ప్రాణ పదంగా ప్రేమించిన ట్రాక్టర్ పైనే తుదకు సిద్దూ(Sidhu Funeral) అంతిమ యాత్ర సాగింది.
కడదాకా జనం అతడి కోసం నడిచారు. ఒక గాయకుడు మరణిస్తే ఇంతలా అభిమానులు రావడం విశేషం. పంజాబ్ లోని మాన్సా జిల్లాలోని ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి.
ఆదివారం 10 మంది సాయుధులైన దుండగులు సిద్దూను కాల్చి చంపారు. అతడిపై 30 రౌండ్ల కాల్పులు జరిపారు. ఆస్పత్రికి తీసుకు వెళ్లే లోపే మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు.
సిద్దూ మూసే వాలా వయసు 28 ఏళ్లు మాత్రమే. మొదట గాయకుడిగా ఆ తర్వాత రాజకీయ వేత్తగా మారారు. ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మాన్సా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు.
ఆప్ అభ్యర్థి విజయ్ సింగ్లా చేతిలో ఓటమి పాలయ్యాడు. భారీ బందోబస్తు మధ్య అతడి అంతిమయాత్ర సాగింది. సిద్దూ(Sidhu Funeral) అంతిమ యాత్రలో పంజాబ్, రాజస్తాన్ , చండీగఢ్, ఢిల్లీ , తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు.
Also Read : గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ కు భద్రత పెంపు