Lawrence Bishnoi Sidhu : బిష్ణోయ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

పంజాబ్ సింగర్ సిద్దూ మూసే వాలా హ‌త్య కేసు

Lawrence Bishnoi Sidhu : ప్ర‌ముఖ పంజాబీ గాయ‌కుడు సిద్దూ మూసే వాలా హ‌త్య కేసులో కీల‌క‌మైన వ్య‌క్తిగా భావిస్తున్న, తీహార్ జైలులో శిక్ష అనుభ‌విస్తున్న లారెన్స్ బిష్ణోయ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని చెబుతూనే త‌న‌ను పంజాబ్ పోలీసుల‌కు అప్ప‌గించ వ‌ద్దంటూ కోరుతున్నారు బిష్ణోయ్ . ఎందుకంటే త‌న‌ను వారికి అప్ప‌గిస్తే ఎన్ కౌంట‌ర్ చేస్తార‌ని ఆందోళ‌న చెందుతున్నాడు.

మంగ‌ళ‌వారం మాన్సా జిల్లాలోని స్వ‌గ్రామంలో త‌ను అమితంగా ఇష్ట‌ప‌డే ట్రాక్ట‌ర్ పైనే అంతిమ యాత్ర సాగింది సిద్దూ మూసేవాలా. అశేష జ‌న‌వాహిని క‌న్నీళ్ల మ‌ధ్య సిద్దూ అంత్య‌క్రియ‌లు ముగిశాయి.

రెండు ముఠాల మ‌ధ్య నెల‌కొన్న విభేదాలే సిద్దూ(Lawrence Bishnoi Sidhu) హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు భావిస్తున్నారు. కాగా త‌న క‌స్ట‌డీని పంజాబ్ పోలీస్ కు వ‌ద్ద‌ని పంజాబ్, హ‌ర్యానా కోర్టును ఆశ్ర‌యించ‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

సిద్దూ హ‌త్య త‌ర్వాత బిష్ణోయ్ కు సెక్యూరిటీ పెంచారు. గ్యాంగ్ స్ట‌ర్ గ‌తంలో ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. కానీ దానిని ఉప‌సంహ‌రించు కున్న‌ట్లు ఏఎన్ఐ వెల్ల‌డించింది.

మూసే వాలా హ‌త్య కేసులో బిష్ణోయ్ ని ఢిల్లీ పోలీసు స్పెష‌ల్ సెల్ మంగ‌ళ‌వారం జైలులో ప్ర‌శ్నించింది. విచార‌ణ చేప‌ట్టింది. ఈ మేర‌కు లారెన్స్ ను అదుపులోకి తీసుకుంది.

సిద్దూ మూసే వాలా హ‌త్య లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi)  , ద‌వీంద‌ర్ బాంబిహా ముఠాల మ‌ధ్య జ‌రిగిన ట‌ర్ఫ్ వార్ తో ముడిప‌డి ఉంది. బంబిహా 2016లో ఎన్ కౌంట‌ర్ కాబ‌డ్డాడు.

అత‌డి ముఠా ప్ర‌స్తుతం ఆర్మేనియాలో జైలు శిక్ష అనుభ‌విస్తున్న లక్ష్మి పాటియాల్ చే న‌డుస్తోంది. కెన‌డాకు చెందిన గోల్డీ బ్రార్ సిద్దూ హ‌త్య‌కు తానే బాధ్య‌త వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

విచిత్రం ఏమిటంటే బ్రార్ లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi)  కు స‌న్నిహితుడు.

Also Read : సింగ‌ర్ సిద్దూకు క‌న్నీటి వీడ్కోలు

Leave A Reply

Your Email Id will not be published!