Lakhimpur Witness : బెంగళూరులో రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్ పై ఇంకు దాడి మరిచి పోక ముందే మరో ఘటన చోటు చేసుకుంది యూపీలో.
దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన లఖింపూర్ ఖేరి(Lakhimpur Witness) ఘటనకు సంబంధించిన కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న భారతీయ కిసాన్ యూనియన్ జిల్లా చీఫ్ దిల్ బాగ్ సింగ్ పై గుర్తు తెలియని దుండగులకు కాల్పులకు పాల్పడ్డారు.
దేశ వ్యాప్తంగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకున్నాయి. దీంతో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించంది.
ఇదే సమయంలో లఖింపూర్ ఖేరి ఘటనలో కేంద్ర హొం శాఖ సహాయ మంత్రితో పాటు తనయుడు ఆశిష్ మిశ్రా ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
దీనిపై ఆయనను అరెస్ట్ చేశారు పోలీసులు. అలహాబాద్ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. దిల్ బాగ్ సింగ్ కారులో వెళుతున్న సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు కాల్పులకు తెగబడ్డారు.
అక్కడి నుంచి పారి పోయారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. దిల్ బాగ్ సింగ్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. లఖింపూర్(Lakhimpur Witness) నుంచి గోలాకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
రాత్రి 10 గంటల సమయంలో జరిగింది. అలీగంజ్ కు వస్తుంగా దాడికి పాల్పడినట్టు స్వయంగా బాధితుడే తెలిపాడు. దుండగులు మూడు రౌండ్ల కాల్పులకు తెగబడ్డారని, ఈ విషయంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.
ఈ విషయం గురించి తెలిసిన వెంటనే బీకేయూ నేత రాకేశ్ తికాయత్ స్పందించారు. ఈ ఘటన చోటు చేసుకోవడం దారుణమన్నారు.
Also Read : బిష్ణోయ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు