Rahul Gandhi : మోదీజీ సినిమా వేరు కశ్మీర్ వేరు
వరుస కాల్పుల ఘటనపై రాహుల్
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నాయకడు రాహుల్ గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై. ఆయన ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కశ్మీర్ ఫైల్స్ పేరుతో తీసిన సినిమాను స్వంతం చేసుకుని దానికి ప్రచారం కల్పించిన ఘనత మీకే దక్కుతుందన్నారు.
కానీ సినిమా వేరు నిజ జీవితంలో చూస్తున్నది వేరని ఎందుకు తెలుసు కోలేక పోతున్నారంటూ ప్రశ్నించారు మోదీని. కశ్మీర్ లో ప్రతి రోజూ కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
వరుసగా కొందరిని టార్గెట్ చేస్తూ దాడులకు తెగ బడుతున్నారని ఇది మంచి పద్దతి కాదన్నారు. ఒక బాధ్యత కలిగిన పీఎం స్థానంలో ఉన్న మోదీ సినిమాను సెలబ్రేట్ చేసుకోవడంలో చూపించినంత శ్రద్ద ఎందుకు కశ్మీర్ లో చోటు చేసుకుంటున్న ఘటనలపై స్పందించడం లేదంటూ నిలదీశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
జమ్మూ కాశ్మీర్ లో పండిట్లపై ఉగ్రవాదులు దాడులు, హత్యలకు పాల్పడుతున్నారని కానీ చూసీ చూడనట్లు వ్యవహరించడం మంచి పద్దతి కాదని సూచించారు.
కశ్మీరీ పండిట్లు గత 18 రోజులుగా ధర్నా చేస్తున్నా పట్టించు కోలేదన్నారు. ఇదే సమయంలో బీజేపీ ఎనిమిదేళ్ల కాలంలో వేడుకలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు.
కుల్దామ్ లోని ఓ ఉన్నత పాఠశాలలో పాఠాలు చెబుతున్న హిందూ టీచర్ ను కాల్చి చంపారు. అంతకు ముందు కాశ్మీరీ పండిట్ ను కాల్చి చంపారు.
ప్రధాన మంత్రి మోదీకి వ్యక్తిగత ఇమేజ్, ప్రచారం తప్ప ప్రజా సమస్యలు, దేశ సమస్యలపై ఫోకస్ పెట్టే తీరిక లేకుండా పోయిందన్నారు రాహుల్ గాంధీ.
Also Read : సోనియా..రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు