KCR : తెలంగాణ పాలన ప్రగతి నివేదన
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో నివేదిక రిలీజ్
KCR : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటై 8 ఏళ్లవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి నివేదికను విడుదల చేసింది. సీఎం కేసీఆర్ హయాంలో చేపట్టిన పనులు, నిధులు, సాధించిన ప్రగతికి సంబంధించి 172 పేజీల ప్రగతి నివేదిక రూపొందించారు.
తన నివేదికలో షాదీ ముబారక్ , కేసీఆర్ కిట్ లు, కళ్యాణ లక్ష్మి, రైతు బీమా, రైతు బంధు, ఆసరా పెన్షన్ల ద్వారా అత్యధిక జనాభాకు లబ్ది చేకూర్చినట్లు తెలిపింది.
నివేదిక ప్రకారం 2018 నుంచి 63 లక్షల మంది రైతులు సంవత్సరానికి రెండు సార్లు రైతు బంధు అందుకుంటున్నారు. ఇది ఎకరాకు రూ. 5,000 సమానం. ఖరీఫ్ సీజన్ లో 60.83 లక్షల మందికి లబ్ది చేకూరుతోంది.
రైతు బీమా పథకం 35.64 లక్షల మంది రైతులకు వర్తిస్తోంది. వీరికి సంబంధించి రాష్ట్ర సర్కార్ ఎల్ఐసీకి రూ. 14,000 కోట్ల ప్రీమియం చెల్లించింది.
ఉచిత గొర్రెల పంపిణీ పథకం కింద 3.88 లక్షల మంది లబ్దిదారులకు 81.60 లక్షల గొర్రెలను పంపిణీ చేసింది. 2017లో ప్రారంభించిన కేసీఆర్(KCR) కిట్ పథకం వల్ల ఎంతో మందికి లబ్ది చేకూరింది.
ఒకరికి రూ.12, 000 నగదు, మగ, ఆడ బిడ్డకు రూ. 13,000 వర్తిస్తాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి దాకా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 11,45, 920 మంది లబ్దిదారులకు మేలు జరిగింది.
ఆరోగ్య శ్రీ పథకం కింద 13.31 లక్షల మంది లబ్దిదారులకు రూ. 5, 817 కోట్లను అందజేసింది. ఐటీ పరంగా మార్చి 2022 నాటికి రూ. 1,45, 522 కోట్లతో 26.14 శాతం పెరిగింది. మొత్తం 1,83,569 కోట్లకు చేరుకుంది.
Also Read : సంక్షేమం తెలంగాణ సంకల్పం – కేసీఆర్