CM KCR : నా తెలంగాణ కోటి ర‌త‌ణాల వీణ

ప్ర‌గ‌తి ప‌థం రాష్ట్రం ల‌క్ష్యం

CM KCR : త‌ర త‌రాల దాష్టీకాన్ని ఎదిరించి, వ‌ల‌స పాల‌న‌ను అంత మొందించి కోట్లాది ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను ప్ర‌తిబింబింప చేస్తూ అలుపెరుగ‌ని రీతిలో పోరాటాన్ని న‌డిపించడ‌మే కాదు రాష్ట్రాన్ని సాధించి పెట్టిన ఉద్య‌మ నాయ‌కుడు కేసీఆర్.

ఆయ‌నే ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల‌లో అభివృద్ది చేసేందుకు కంక‌ణం క‌ట్టుకున్నారు. ఆ మేర‌కు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ధ్యేయంగా పాల‌న‌ను ప‌రుగులు తీయిస్తున్నారు.

ఒక‌ప్పుడు నీళ్ల కోసం, కూటి కోసం, ఉపాధి కోసం నానా తంటాలు ప‌డిన ఈ నేల ఇప్పుడు పచ్చ‌ని పంట‌ల‌తో అల‌రారుతోంది. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా ప‌చ్చ‌ద‌న‌మే అగుపిస్తోంది.

ఒక ర‌కంగా చెప్పాలంటే ఆకుప‌చ్చ‌ని తెలంగాణ‌గా మారింది. ఉద్య‌మ నాయ‌కుడి సార‌థ్యంలో తెలంగాణ రాష్ట్రం ప్ర‌గ‌తి ప‌థంలో ప‌య‌నిస్తోంది. వ‌డి వ‌డిగా అడుగులు వేస్తున్న‌ది.

ఐటీ ప‌రంగా దేశంలోనే టాప్ లో నిలిచింది. ఓ వైపు తెలంగాణ ముందంజ‌లో ఉంటే దేశం వెనుకంజ‌లో ఉండ‌డం కేసీఆర్ తీసుకున్న అసాధార‌ణ‌మైన నిర్ణ‌యం.

అదే టీఎస్ఐపాస్ పాల‌సీ. ప్ర‌పంచ వ్యాప్తంగా దిగ్గ‌జ కంపెనీల‌న్నీ ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నాయి. కోట్లాది రూపాయ‌ల పెట్టుబ‌డుల‌తో ఇక్క‌డ వాలి పోతున్నాయి.

సంక్షేమ ప‌థ‌కాల‌తో అల‌రారుతోంది. ఒక‌ప్పుడు వ్య‌వ‌సాయం దండుగ అన్న దానిని రూపు మాపారు కేసీఆర్. దానిని పండుగ‌లా చేశారు. రైతుల‌ను ల‌క్షాధికారులుగా మార్చిన ఘ‌న‌త ఆయ‌న‌దే. ఒక‌ప్పుడు పంజాబ్ ధాన్యాగారంగా ఉండేది.

కానీ ఇవాళ తెలంగాణ దేశానికి భాండాగారంగా నిలిచింది. ఇదంతా సీఎం కేసీఆర్(CM KCR)  వ‌ల్ల‌నే జ‌రిగింది. ఏదో ఒక రోజు తెలంగాణ కోటి కాంతుల‌తో విర‌జిల్ల‌డం ఖాయం. దాశ‌ర‌థి అన్న‌ట్టు నా తెలంగాణ కోటి ర‌త‌ణాల వీణ కానుంద‌న్న‌మాట‌.

Also Read : తెలంగాణ పాల‌న ప్ర‌గ‌తి నివేద‌న

Leave A Reply

Your Email Id will not be published!