Modi & Rahul Gandhi : తెలంగాణ‌కు మోదీ..రాహుల్ గ్రీటింగ్స్

రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా 8వ ఆవిర్భావ వేడుక‌లు

Modi & Rahul Gandhi : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఈ సంద‌ర్భంగా నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జానీకానికి శుభాకాంక్ష‌లు వెల్లువ‌లా వ‌స్తున్నాయి.

వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు గ్రీటింగ్స్ తెలియ చేస్తున్నారు. తాజాగా దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ,(Modi)  కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ధ‌న్య‌వాదాలు తెలిపారు.

తాజాగా సీఎం కేసీఆర్ ప‌బ్లిక్ గార్డెన్స్ లో జ‌రిగిన వేడుక‌ల‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా త‌మ ఆట‌తో తెలంగాణ‌కు పేరు తీసుకు వ‌చ్చిన విమెన్ బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్ , షూట‌ర్ నిషా సింగ్ ల‌ను ఘ‌నంగా స‌న్మానించారు.

వారికి ఒక్కొక్క‌రికి రూ. 2 కోట్ల చొప్పున చెక్కులు అంద‌జేశారు. అంతే కాకుండా ఇంటి స్థ‌లం కూడా ప్ర‌క‌టించారు సీఎం కేసీఆర్. నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జానీకానికి శుభాకాంక్ష‌లు ప్ర‌త్యేకంగా తెలిపారు ప్ర‌ధాని మోదీ.

నా తెలంగాణ సోద‌రీ , సోద‌రీమ‌ణుల‌కు గ్రీటింగ్స్ . క‌ష్ట‌ప‌డి ప‌ని చేయ‌డంలో మీకు మీరే సాటి. దేశ అభివృద్దిలో మీ పాత్ర కీల‌కం. ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా మీరు ఎంతో సాధించి పేరు తీసుకు వ‌చ్చేలా చేశార‌ని కితాబు ఇచ్చారు మోదీ.

తెలంగాణ రాష్ట్ర సంస్కృతి భిన్న‌మైన‌ది. ఇలాగే ప‌రిఢ‌విల్లాల‌ని కోరుతున్నాన‌ని పేర్కొన్నారు ప్ర‌ధాన మంత్రి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు.

ఈ చారిత్రాత్మ‌క‌మైన రోజున అమ‌ర వీరులు, వారి కుటుంబ స‌భ్యుల త్యాగాల‌ను స్మ‌రించుకుందామ‌ని తెలిపారు. ఉజ్వ‌ల తెలంగాణ నిర్మాణానికి కాంగ్రెస్ క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు.

Also Read : ఎమ్మెల్యేలు జారి పోకుండా కాంగ్రెస్ ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!