Imran Khan : ఆర్మీ నిర్వాకం వల్లే పదవి కోల్పోయా
చేతులు కట్టేసి బ్లాక్ మెయిల్ చేశారు
Imran Khan : అనూహ్యంగా అవిశ్వాస తీర్మానంలో ఓటమి పాలై ప్రధాన మంత్రి పదవిని కోల్పోయిన మాజీ పాకిస్తాన్ స్కిప్పర్, మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్(Imran Khan) మరింత దూకుడు పెంచారు. ఆయన దేశ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
పనిలో పనిగా పాకిస్తాన్ ఆర్మీ (సైన్యాన్ని) పై నిప్పులు చెరిగారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. తన చేతులు కట్టేసి తనను బ్లాక్ మెయిల్ చేశారంటూ ఆరోపించారు ఇమ్రాన్ ఖాన్.
2018లో మిలటరీ అండతో అధికారంలోకి వచ్చిన ఆయన పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయిన ఏకైక ప్రధాన మంత్రిగా చరిత్ర సృష్టించారు. పాకిస్తాన్ లో అధికారం ఎవరి చేతుల్లో ఉండదన్నాడు.
అంతే కాదు అది ఎక్కడ ఉంటుందో ఇప్పటి వరకు పాలించిన ప్రధానులకు కానీ, ప్రెసిడెంట్ లకు కానీ తెలియదన్నాడు. పవర్ ఎక్కడ ఉందో అందరికీ తెలుసు కాబట్టి వారిపైనే ఆధార పడాల్సి వచ్చిందని చెప్పారు.
ఆ ఆధార పడటం అన్నది ఆర్మీపైనేనని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. పాకిస్తాన్ ఆర్మీ ముందు తన ప్రభుత్వం బలహీనమైనదని పేర్కొన్నాడు.
అధికారం తన వద్ద లేక పోవడం వల్ల తాను బ్లాక్ మెయిల్ కు గురయ్యానని వాపోయాడు. దీంతో తాను ఉన్నతమైన పదవిని కోల్పోవాల్సి వచ్చిందన్నాడు. ఈ సిస్టమ్ మారితే కానీ దేశం బాగు పడదన్నాడు.
గతంలో ఎన్నడూ లేని రీతిలో పాకిస్తాన్ ఆర్మీపై తీవ్ర ఆరోపణలు చేశారు ఇమ్రాన్ ఖాన్. రష్యా, చైనా, ఆఫ్గనిస్తాన్ లపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడాన్ని జీర్ణించు కోలేని అమెరికా తనను దించేందుకు కుట్ర పన్నిందని ఆరోపించాడు.
Also Read : అమిత్ షాతో అజిత్ దోవల్ అత్యవసర భేటీ