Mohan Bhagwat : చ‌రిత్ర నిజం దానిని మార్చ‌లేం – భ‌గ‌వత్

శివ లింగం కోసం ఎందుకు వెత‌కాలి

Mohan Bhagwat : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే యూపీలోని వార‌ణాసి జ్ఞాన్ వాపి మ‌సీదు పై కేసు న‌డుస్తోంది. ఈ సంద‌ర్భంగా మోహ‌న్ భ‌గ‌వ‌త్ కీల‌క కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

ప్ర‌తి మ‌సీదులో శివ లింగం కోసం ఎందుకు వెత‌కాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కాగా జ్ఞాన్ వాపి మ‌సీదు చిత్రీక‌ర‌ణ‌పై త‌లెత్తిన వివాదంపై ప‌ర‌స్ప‌రం ఒప్పందం ద్వారా ప‌రిష్క‌రించు కోలేమా అని మోహ‌న్ భ‌గ‌వంత్(Mohan Bhagwat) నిల‌దీశారు.

ఇదిలా ఉండ‌గా హిందూ దేవుళ్లు, దేవ‌త‌ల విగ్ర‌హాలు ఉన్నాయా లేవా అన్న దానిపై వార‌ణాసి కోర్టు జ్ఞాన్ వాపి మ‌సీదులో స‌ర్వే చేయాల‌ని ఆదేశించింది. దీనిపై హిందూ, ముస్లిం వ‌ర్గాలు కోర్టుకు ఎక్కాయి.

ఈ అంశం సున్నిత‌మైన‌ది కావ‌డంతో సుప్రీంకోర్టు విచారించింది. చివ‌ర‌కు అంతిమ తీర్పు వార‌ణాసి సిటీ కోర్టుకు బ‌దిలీ చేసింది. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. చ‌రిత్ర ను తెలుసు కోవాల్సిన బాధ్య‌త ఆ ప్రాంతానికే చెందుతుంది.

అందుకే కేసు విచార‌ణ‌ను కింది కోర్టుకు బ‌దిలీ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. జ్ఞాన్ వాపి వివాదంపై మోహ‌న్ భ‌గ‌వత్(Mohan Bhagwat) తాజాగా స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

తాము కొన్ని ప్ర‌దేశాల‌పై ప్ర‌త్యేక భ‌క్తిని క‌లిగి ఉన్నామ‌న్నారు. ప్ర‌తి రోజూ ఏదో ర‌కంగా కొత్త విష‌యం, స‌మ‌స్య నెల‌కొంటోంది. ఇది మంచి ప‌ద్ద‌తి కాదు. ఎందుకు వివాదం పెంచాల‌ని అనుకుంటున్నార‌ని అన్నారు.

జ్ఞాన్ వాపిపై మాకు భ‌క్తి ఉంద‌న్నారు. ప్ర‌తి మ‌సీదులో శివ‌లింగం ఉందో లేదో అని ఎందుకు వెత‌క‌డం అని ప్ర‌శ్నించారు ఆర్ఎస్ఎస్ చీఫ్‌. నాగ్ పూర్ లో ఆయ‌న మాట్లాడారు.

Also Read : మోదీ సార‌థ్యంలో సాధార‌ణ సైనికుడిని

Leave A Reply

Your Email Id will not be published!