India Slams Us Report : యుఎస్ నివేదికపై భారత్ సీరియస్
ఓటు బ్యాంకు రాజకీయాలే అంటూ ఫైర్
India Slams Us Report : భారతదేశంలో 2021లో మైనార్టీ వర్గాలపై అత్యధికంగా దాడులు జరిగాయంటూ, వారి ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందంటూ యుఎస్ నివేదిక వెల్లడించడాన్ని భారత ప్రభుత్వం(India Slams Us Report) తీవ్రంగా ఖండించింది.
అంతర్జాతీయ సంబంధాలలో ఓటు బ్యాంకు రాజకీయాలుగా దీనిని అభివర్ణించింది. ఒక దేశం గురించి ఇంకో దేశం ఎలా తీర్పు ఇచ్చేలా నివేదిక తయారు చేస్తుందని ప్రశ్నించింది.
తమ దేశంలో ఏం జరుగుతుందో చూసు కోకుండా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచి పద్దతి కాదని సున్నితంగా సూచించింది. ఇది పూర్తిగా గర్హనీయమని పేర్కొంది.
విచిత్రం ఏమిటంటే అమెరికాలో పెద్ద ఎత్తున కాల్పులకు తెగ బడుతున్నారు. పిట్టల్లా రాలి పోతున్నారు. మరి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో చెప్పగలదా అని నిలదీసింది భారత్(India Slams Us Report).
అది ఆ దేశ అంతర్గత వ్యవహారమని, భారత దేశ విదేశాంగ విధానం ప్రపంచంలోనే అత్యున్నతమైనదని పేర్కొంది. తాము శాంతిని తప్ప ఇంకొకరిని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగడం, వివక్ష పూరితంగా వ్యవహరించడం అంటూ ఏదీ ఉండదని స్పష్టం చేసింది.
ప్రేరేపించేలా నివేదికలు ఇవ్వడం, పక్షపాత ధోరణి ప్రదర్శించేలా రిపోర్టులు తయారు చేయడం మంచి పద్దతి కాదని పేర్కొంది.
ప్రపంచంలోనే అత్యున్నత ప్రజాస్వామ్య విలువలను కలిగి ఉన్న ఏకైక దేశం ఒక్క భారత దేశం మాత్రమేనని మరోసారి స్పష్టం చేసింది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.
అమెరికా వెల్లడించిన నివేదిక పూర్తిగా తప్పులు తడక అని, అవాస్తవాలకు ప్రతీకగా ఉందని కుండ బద్దలు కొట్టింది.
Also Read : నిబంధనలు పాటిస్తేనే విమాన ప్రయాణం