Nupur Sharma : నూపుర్ శర్మకు షాక్ బీజేపీ నుంచి ఔట్
కోలుకోలేని షాక్ ఇచ్చిన హైకమాండ్
Nupur Sharma : యూపీ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మపై వేటు వేసింది బీజేపీ హై కమాండ్ . ముస్లింకు ఆరాధ్య దైవమైన మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పెద్ద ఎత్తున రాష్ట్రంలో అల్లర్లు చోటు చేసుకున్నాయి.
కాన్పూర్ లో ఇరు వర్గాలు దాడులకు దిగాయి. ఒకరొపై మరొకరు రాళ్లు రువ్వుకునే దాకా వెళ్లాయి. నూపుర్ శర్మ చేసిన కామెంట్స్ పై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తాయి.
దేశ వ్యాప్తంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఈ తరుణంలో పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ ఏర్పడుతుందని భావించిన బీజేపీ హై కమాండ్ రంగంలోకి దిగింది.
ప్రత్యేకంగా సమావేశమైన పార్టీ ఆదివారం నూపుర్ శర్మ(Nupur Sharma)ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో ఢిల్లీ బీజేపీ మీడియా ఇన్ చార్జ్ నవీన్ కుమార్ జిందాల్ ను కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు డిక్లేర్ చేసింది.
పార్టీ వైఖరికి విరుద్దంగా మీరు వ్యాఖ్యలు చేయడం గర్హనీయం. ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా కామెంట్స్ చేయడం పార్టీ సహించదని స్పష్టం చేసింది పార్టీ కేంద్ర క్రమశిక్షణా సంఘం.
ముందు వెనుకా ఆలోచించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పరిణతి చెందిన నాయకులు చేయరని పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యల వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతుందని తెలిపింది.
ఇదిలా ఉండగా నూపుర్ శర్మ చేసిన కామెంట్స్ కారణంగా చోటు చేసుకున్న ఘర్షణల్లో 40 మంది గాయపడ్డారు. కాన్పూర్ లో ఇప్పటికీ 144 సెక్షన్ అమలు అవుతుండడం గమనార్హం.
Also Read : బీజేపీ దృష్టిలో అన్ని మతాలు ఒక్కటే