NCW CS DGP : సీఎస్, డీజీపీకి మహిళా కమిషన్ నోటీసులు
అమ్నీషియా పబ్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు
NCW CS DGP : హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు దేశాన్ని కుదిపి వేసింది. ఐదు మంది నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
దీనిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురు నిందితులు ఉన్నారని వారిలో ముగ్గురు మైనర్లని వెస్ట్ జోన్ డీసీపీ వెల్లడించారు.
ఈ ఘటనలో పూర్తిగా ఓ ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన నాయకుల పిల్లలే ఉండడం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. జాతీయ స్థాయిలో బాలిక గ్యాంగ్ రేప్ వ్యవహారం చర్చకు దారి తీసింది.
ఈ నేపథ్యంలో లైంగిక దాడి ఘటనపై జాతీయ మహిళా కమిషన్(NCW CS DGP) స్పందించింది. కేసుకు సంబంధించి మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్(CS) సోమేష్ కుమార్ , డీజీపీ మహేందర్ రెడ్డిలకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.
ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ దీనిపై తీవ్రంగా పోరాడుతోంది. ఆ పార్టీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఘటనకు సంబంధించి ఫోటోలు, వీడియోలను పార్టీ ఆఫీసు వేదికగా వెల్లడించారు.
దీంతో ఒక్కసారిగా పోలీసులు విస్తు పోయారు. ప్రెస్ మీట్ లో డీసీపీ(DGP) చెప్పిన విషయాలకు ఎమ్మెల్యే వెల్లడించిన వాస్తవాలకు పొంతన లేకుండా పోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
రేప్ ఘటన కేసులో మొదట కారును పేర్కొన్నారు. వారం రోజుల తర్వాత ఓ ఫామ్ హౌస్ దగ్గర ఇన్నోవా కారు దొరికిందని చెప్పడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
మొత్తంగా హైదరాబాద్ ఇప్పుడు గ్యాంగ్ రేప్ లకు అడ్డాగా మారడం దారుణమని అంటున్నాయి మహిళా సంఘాలు.
Also Read : హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్ ల కలకలం