ED Seizes : జైన్ నివాసాల్లో రూ. 2 కోట్ల నగదు లభ్యం
133 బంగారు నాణేలు స్వాధీనం
ED Seizes : ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ను మనీ లాండరింగ్ కేసులో సీబీఐ కేసు మేరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. కోర్టులో హాజరు పర్చడంతో ఈనెల 9 వరకు జైన్ ను ఈడీ కస్టడీలోకి తీసుకుంది.
కేసు విచారణలో భాగంగా మంత్రి సత్యేంద్ర జైన్ కు సంబంధించిన ఇళ్లు, ఇతర ప్రాంతాలలో ఈడీ దాడులు, సోదాలు చేపట్టింది. విస్తు పోయేలా రూ. 2 కోట్లకు పైగా నగదు 133 బంగారు నాణేలు దొరికాయి.
వాటిని ఈడీ సీజ్(ED Seizes) చేసింది. స్వాధీనం చేసుకున్న బంగారు నాణేలు 1.8 కోలోలు ఉంటుందని అంచనా. మంత్రి నివాస ప్రాంగణాలు, కొన్ని ఇతర ప్రదేశాలలో ఈ దాడులు చేశామని ఈడీ అధికారులు వెల్లడించారు.
కోల్ కతాకు చెందిన కంపెనీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈ ఏడాది ఏప్రిల్ రూ. 4.81 కోట్ల విలువైన స్థిరాస్తులను కలిగి ఉన్నారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో మంత్రిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు ఏజెన్సీ ఆప్ నాయకుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఇందులో మంత్రి జైన్ వాటాదారుగా ఉన్న నాలుగు కంపెనీలకు నిధులు ఎలా వచ్చాయనే దానిపై ఇప్పటి వరకు సరైన సమాధానం ఇవ్వలేక పోయారని ఈడీ(ED Seizes) వెల్లడించింది.
మంత్రి సత్యేంద్ర జైన్ అనేక షెల్ కంపెనీలను కొనుగోలు చేశారని, వాటి ద్వారా రూ. 16.39 కోట్ల విలువైన నల్ల ధనాన్ని వైట్ మనీగా మార్చేశారని ఆరోపించింది.
ఇదిలా ఉండగా కక్ష సాధింపు లో భాగంగానే తమ మంత్రిని అరెస్ట్ చేశారంటూ ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
Also Read : రాజ్యసభ ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యేలే కీలకం