CDS Govt Change : కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం

సీడీఎస్ పోస్టు ప‌రిధి విస్తృతం

CDS Govt Change : కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల ప్ర‌త్యేకంగా స‌మావేశం కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. తాజాగా రక్ష‌ణ శాఖ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

దేశంలో ప్ర‌స్తుతం ర‌క్ష‌ణ‌, ఆర్మీ ప‌రంగా ఉన్న‌త‌మైన పోస్ట్ సీడీఎస్(CDS Govt Change) . అత్యున్న‌త పోస్టుల‌న్నీ ఒకే గొడుగు కింద‌కు తీసుకు వ‌చ్చింది. అత్యుత‌న్న‌త పోస్టు కోసం ప్ర‌భుత్వం భారీ మార్పు చేసింది.

ట్రై స‌ర్వీసెస్ లోని రెండో అత్యున్న‌త యాక్టివ్ ర్యాంక్ అధికారుల‌కు వారి సీనియ‌ర్ల స్థానాల్లో భ‌ర్తీ చేసేందుకు త‌లుపులు తెరించింది. ఇదిలా ఉండ‌గా భార‌త తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో మ‌ర‌ణించారు.

భార‌త సాయుధ ద‌ళాల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్ ) ప‌ద‌వికి అర్హులైన అధికారుల ప‌రిధిని విస్తృతం చేస్తూ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ లేదా నౌకా ద‌ళం , వైమానిక ద‌ళంలో వారికి స‌మాన‌మైన వారు కూడా సీడీఎస్(CDS Govt Change) కావ‌చ్చు. ఈ పోస్ట్ దేశంలోనే అత్యున్న‌త‌మైన పోస్ట్. అర్హ‌త ప్ర‌మాణాల‌లో కూడా కీల‌క మార్పు చేసింది.

ఇటీవ‌ల ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన సర్వీస్ చీఫ్ లు , వైస్ చీఫ్ లు కూడా సీడీఎస్ పోస్ట్ కు అర్హుల‌ని స్ప‌ష్టం చేసింది. భార‌త దేశ‌పు మొద‌టి సీడీఎస్ విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన త‌ర్వాత కొత్త సీడీఎస్ కోసం ఈ చ‌ర్య మార్గం సుగ‌మం చేసింది.

ఆనాటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ ఆర్మీ చీఫ్ గా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసి భార‌త దేశ‌పు మొద‌టి సీడీఎస్ ప‌ద‌వికి ఎదిగాడు.

Also Read : సీఎస్, డీజీపీకి మ‌హిళా క‌మిష‌న్ నోటీసులు

Leave A Reply

Your Email Id will not be published!