Subhash Chandra : రాజ్యసభ ఎన్నికల్లో నాదే గెలుపు
మీడియా మొఘల్ ఎస్సెల్ (జీ) గ్రూప్ చైర్మన్
Subhash Chandra : రాజస్థాన్ రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల వేడి మరింత రాజుకుంది. ఊహించని రీతిలో భారతీయ మీడియా మొఘల్ గా పేరొందిన ఎస్సెల్ (జీ) గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర రంగంలోకి దిగారు.
ఆయనకు అంతర్గతంగా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తోంది. రాష్ట్రానికి సంబంధించి నాలుగు రాజ్యసభ స్థానాలు ఉన్ఆయి. 108 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలు దక్కనుండగా బీజేపీ తన బలం ఆధారంగా ఒక సీటు గెలుచుకోనుంది.
సుభాష్ చంద్ర రేసులో ఉండడంతో మిగతా ఒక్క స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. నాలుగు సీట్లకు గాను ఐదుగురు బరిలో ఉన్నారు. సుభాష్ చంద్ర(Subhash Chandra) ఇండిపెండెంట్ గా పోటీలో ఉన్నప్పటికీ ఆయనకు బీజేపీ మద్దతు ఇస్తుండడం బహిరంగ రహస్యమే.
ఇదిలా ఉండగా ఇక్కడ తమ రాష్ట్రానికి కాదని రాష్ట్రేతర నాయకులను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించడాన్ని ఆ పార్టీకి చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు జీర్ణించు కోలేక పోతున్నారు.
ఇదిలా ఉండగా మంగళవారం మీడియా బ్యారన్ సుభాష్ చంద్ర షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ తో తాను గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు తనకు మద్దతు ఇస్తున్నారని చెప్పారు.
ఎనిమిది మంది తనకు అనుకూలంగా ఓటు వేయబోతున్నట్లు తెలిపారు. జైపూర్ లో సుభాష్ చంద్ర(Subhash Chandra) మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని కానీ ఎవరనేది ఇప్పుడు చెప్పడం మంచి పద్దతి కాదన్నారు.
సుభాష్ చంద్ర గెలవాలంటే 8 మంది ఎమ్మెల్యేలు అవసరం అవుతారు. బీజేపీకి 71 సీట్లు ఉన్నాయి. 30 ఓట్లు సుభాష్ చంద్రకు వెళతాయి.
రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఆయనకే మద్దతు ఇస్తున్నారు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది.
Also Read : పార్టీ నేతలకు బీజేపీ లక్ష్మణ రేఖ