HD Kumaraswamy : కాంగ్రెస్ కు కుమార స్వామి బంపర్ ఆఫర్
కలిసి నడుద్దాం బీజేపీని ఓడిద్దాం
HD Kumaraswamy : రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు ముందుకు రావాలని కాంగ్రెస్ పార్టీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు మాజీ సీఎం ,
జేడీఎస్ నేత హెచ్ డి కుమార స్వామి(HD Kumaraswamy). పార్టీల పరంగా అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఉమ్మడి శత్రువు ఒక్కడే కాబట్టి కలిసి నడుద్దామన్నారు.
బీజేపీని ఓడించడమే తన ప్రధాన ఎజెండా అని ఆయన స్పష్టం చేశారు. రెండో ప్రాధాన్యత ఓట్లను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయాలని కోరారు.
ఇదిలా ఉండగా ఈనెల 10న రాజ్యసభ ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. దేశంలోని 15 రాష్ట్రాలలో 57 స్థానాలకు ఖాళీలు ఉండగా నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇందులో భాగంగా ఇప్పటి వరకు 41 ఎంపీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో ఇంకా 16 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా కర్ణాటక రాష్ట్రంలో నాలుగు స్థానాలకు రాజ్యసభ ఎన్నికల కోసం ఆరుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
నాల్గవ స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. రాష్ట్ర అసెంబ్లీ నుండి నాలుగో స్థానాన్ని గెలుచు కునేందుకు తగిన సంఖ్యలో ఓట్లు లేనప్పటికీ రాష్ట్రంలోని మూడు రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ , జేడీఎస్ అభ్యర్థులను నిలబెట్టాయి.
తనకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ దీప్ సింగ్ సూర్జేవాలా ఫోన్ చేశారని చెప్పారు కుమార స్వామి(HD Kumaraswamy). మాకు 32 రెండోవ ప్రాధాన్యత ఓట్లు ఉన్నాయి.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి బదిలీ చేసేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. కాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 24 రెండో ప్రాధాన్యత ఓట్లను తిరిగి తమకు ఇవ్వాలని కోరామన్నారు.
Also Read : వంగ భూమిని ముక్కలు కానివ్వను – దీదీ