Dasoju Sravan : రేప్ లకు అడ్డాగా మారిన హైదరాబాద్
చోద్యం చూస్తున్న పోలీసులు ..సర్కార్
Dasoju Sravan : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమ్నీషియా మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. పొంతన లేకుండా మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు.
మొన్న వెస్ట్ జోన్ డీసీపీ ఎమ్మెల్యే కొడుకు లేడన్నారు. హోం మంత్రి మనుమడి పాత్ర లేదని చెప్పారు. ఇక సీపీ సీవీ ఆనంద్ మాత్రం ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడని మైనర్ కాబట్టి పేరు చెప్పేందుకు వీలు లేదనడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
బుధవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లడారు దాసోజు శ్రవణ్(Dasoju Sravan). మొత్తంగా పోలీసులు నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు.
కేసుకు సంబంధించి 20 ఏళ్ల శిక్ష పడుతుందని సీపీ ఎలా చెబుతారని ప్రశ్నించారు. కేసును దర్యాప్తు చేయడం వరకు మాత్రమే పోలీసులు పని చేయాల్సి ఉంటుదంన్నారు.
కేసుకు సంబంధించి శిక్షను విధించేది కోర్టులు నిర్ణయిస్తాయన్నారు. మెర్సిడెస్ బెంజ్ కారు ఎవరిది. అత్యాచారానికి పాల్పడిన ఇన్నోవా కారు ఎవరిదో ఈరోజు వరకు బయటకు ఎందుకు చెప్పడం లేదని సీపీని నిలదీశారు శ్రవణ్(Dasoju Sravan).
మే 31న ఫిర్యాదు చేస్తే కేసు దర్యాప్తు చేసేందుకు ఏడు రోజుల సమయం పట్టిందన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే పెద్దోలకు మేలు చేసేందుకేనా మీరున్నది అంటూ నిప్పులు చెరిగారు.
సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ కాక పోయి ఉంటే ఎమ్మెల్యే కొడుకును తప్పించి ఉండేవారని అన్నారు. దిశ ఘటనలో వివరాలు వెంటనే వెల్లడించిన పోలీసులు ఈ మైనర్ గ్యాంగ్ రేప్ విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదని అన్నారు.
Also Read : గ్యాంగ్ రేప్ కేసులో ఆ కార్లు ఎవరివి