Sonia Gandhi : మూడు వారాల గ‌డువు కోరిన సోనియా

వెల్ల‌డించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్

Sonia Gandhi :  నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రిక నిర్వ‌హ‌ణ‌లో మ‌నీ లాండ‌రింగ్ జ‌రిగిందన్న ఆరోప‌ణ‌ల‌పై కేసు న‌మోదు చేసింది ఈడీ. ఈ మేర‌కు

కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ(Sonia Gandhi)  తో పాటు కొడుకు రాహుల్ గాంధీకి కూడా స‌మ‌న్లు జారీ చేసింది.

ఈ త‌రుణంలో సోనియా గాంధీకి మ‌రోసారి టెస్ట్ లో కోవిడ్ పాజిటివ్ అని తేలింది. తాను క్వారంటైన్ లో ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఈ మేర‌కు

ఈడీ ముందుకు విచార‌ణ నిమిత్తం రాలేన‌ని తెలిపింది.

ఈ విష‌యాన్ని కాంగ్రెస్ పార్టీ ధ్రువీక‌రించింది. ఇందుకు గాను త‌న‌కు మూడు వారాల గ‌డువు ఇవ్వాల‌ని కోరింది. విదేశీ టూర్ ముగించుకుని వ‌చ్చిన రాహుల్ గాంధీ ఈడీ ముందుకు హాజ‌రు కావాల్సి ఉంది.

మ‌రి ఆయ‌న హాజ‌రు కానున్నారా లేదా అన్న‌ది తెలియాల్సి ఉంది. ఈ అంశానికి సంబంధించి పార్టీ ఇప్ప‌టి దాకా క్లారిటీ ఇవ్వ‌లేదు. ఇదిలా ఉండగా డాక్ట‌ర్లు సైతం ఆమెకు విశ్రాంతి అవ‌స‌రం అని పేర్కొన‌డంతో ఈడీ స‌మ‌న్లు జారీ, హాజ‌రుపై మ‌రోసారి స్ప‌ష్టత ఇచ్చింది.

నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో మూడు వారాల త‌ర్వాత కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ(Sonia Gandhi) కి కొత్త‌గా స‌మ‌న్లు జారీ చేయ‌నున్న‌ట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

మంగళ‌వారం ఏజెన్సీ ఆఫీసులో హాజరు కావాల్సి ఉండింది. కోవిడ్ సోక‌డం వ‌ల్ల తాను రాలేన‌ని స‌మాచారం అందించింది. దీంతో కోవిడ్ త‌గ్గాక‌,

వైద్యులు నిర్దారించిన త‌ర్వాత తాను ఈడీ ముందుకు రాగ‌ల‌న‌ని, అప్ప‌టి దాకా త‌న‌ను డిస్ట్ర‌బ్ చేయ‌వ‌ద్దంటూ సూచించింది.

మొత్తంగా ఈ కేసు ను గ‌తంలో కొట్టి వేయ‌డం జ‌రిగింద‌ని కానీ కేంద్ర ప్ర‌భుత్వం కావాల‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో తీసుకు వ‌చ్చేలా చేసిందంటూ

కాంగ్రెస్ ఆరోపించింది.

ఇదంతా డ్రామా త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని పేర్కొంది. ఆనాడే క్లీన్ చిట్ ఇచ్చింద‌ని తెలిపింది. కాగా ఈ కేసులో మ‌నీ లాండ‌రింగ్ జ‌రిగిందంటూ

బీజేపీ నాయ‌కుడు, మాజీ ఎంపీ, న్యాయ‌వాది సుబ్ర‌మ‌ణ్య స్వామి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు మ‌ళ్లీ ఓపెన్ చేశారు.

Also Read : రెచ్చ గొట్ట‌డంలో బీజేపీ నేత‌లు ముదుర్లు

Leave A Reply

Your Email Id will not be published!