Hate Speech Case : వివాదాస్పద వ్యాఖ్యలు నేతలపై కేసులు
జర్నలిస్టులకు కూడా ఝలక్
Hate Speech Case : దేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు(Hate Speech Case) చేస్తూ సంచలనాలకు కేరాఫ్ గా మారిన ఆయా పార్టీలకు చెందిన నేతలకు కోలుకోలేని షాక్ తగిలింది. ఆయా సందర్భాలలో రెచ్చగొట్టేలా కామెంట్స్ చేసినందుకు గాను ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు.
ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. ప్రవక్త మహ్మద్ పై కామెంట్స్ చేసిన బీజేపీ నుంచి సస్పెండ్ కు గురైన నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ తో పాటు ఎంఐఎం నేత , ఎంపీ ఓవైసీపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
విద్వేష పూరిత ప్రసంగాలు, సమూహాలను రెచ్చగొట్టారని వీరిపై ఆరోపణలు చేశారు. బహిష్కరణకు గురైన బీజేపీ అధికార ప్రతినిధులు, ఎంపీ, జర్నలిస్టు, సోషల్ మీడియా యూజర్లు , మత పరమైన సంస్థల సభ్యుల పేర్లతో రెండు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి.
ఢిల్లీ పోలీసులు ఎంఐఎం చీఫ్ ఓవైసీ పై, హరిద్వార్ ద్వేష పూరిత ప్రసంగం కేసు(Hate Speech Case) లో బెయిల్ పై ఉన్న యతి నర్సింహానంద్ లను కూడా చేర్చారు.
వీరందరిపై మత పరమైన మనోభావాలు రెచ్చ గొట్టడం, అవమానించడం, గాయ పర్చడం వంటి సెక్షన్లు 153, 295, 505 సెక్షన్లు నమోదు చేశారు.
వీరితో పాటు పీస్ పార్టీ స్పోక్స్ పర్సన్ షాదాబ్ చౌహాన్ , జర్నలిస్టు సబా నఖ్వీ ,హిందూ మహాసభ ఆఫీస్ బేరర్ పూజా కుషన్ పాండే, రాజస్తాన్ కు చెందిన మౌలానా ముఫ్తీ నదీమ్ , అబ్దుల్ రెహ్మాన్ , అనిల్ కుమార్ మీనా, గుల్జార్ అన్సారీ పై కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు కేపీఎస్ మల్హోత్రా వెల్లడించారు.
Also Read : రెచ్చ గొట్టడంలో బీజేపీ నేతలు ముదుర్లు