Saba Naqvi : జర్నలిస్ట్ సబా నఖ్వీపై కేసు నమోదు
నూపుర్ శర్మతో ఇంటర్వ్యూ పర్యవసానం
Saba Naqvi : దేశంలో పేరొందిన జర్నలిస్టులలో ప్రత్యేకించి విమెన్ వింగ్ లో సబా నఖ్వీ(Saba Naqvi) పేరొందారు. ఆమె ఇటీవల భారతీయ జనతా పార్టీ నుంచి బహిష్కరణకు గురైన అధికార ప్రతినిధిగా ఉన్న నూపుర్ శర్మతో ఇంటర్వ్యూ చేసింది.
ఈ సంభాషణలో నూపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెను సపోర్ట్ చేస్తూ బీజేపీ ఢిల్లీ మీడియా ఇన్ చార్జ్ నవీన జిందాల్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేశాడు.
దీంతో ఈ కామెంట్స్ వ్యవహారం మొత్తం గందరగోళానికి దారి తీసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 57 ముస్లిం దేశాలు ముక్త కంఠంతో ఖండించాయి.
అదే సమయంలో భారత దేశం తయారు చేసిన ఉత్పత్తులను అమ్మొద్దంటూ ఆదేశాలు జారీ చేశాయి. భారతీయ రాయబారులను పిలిపించి భారత ప్రభుత్వం తమకు క్షమాపణ చెప్పాలని కోరాయి.
ఈ మేరకు భారత్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆ వివాదాస్పద కామెంట్స్ ప్రభుత్వం తరపున చేయలేదని, వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని స్పష్టం చేసింది.
భారత దేశం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని స్పష్టం చేసింది. ఈ తరుణంలో దేశంలో ఇటీవలి కాలంలో వివాదాస్పద కామెంట్స్ చేసిన వివిధ పార్టీలకు చెందిన నేతలపై వేర్వేరుగా కేసులు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ కేపీఎస్ మల్హోత్రా వెల్లడించారు.
తాజాగా నూపుర్ శర్మను ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ సబా నఖ్వీ(Saba Naqvi) పై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీనిపై జర్నలిస్టులు తీవ్ర అభ్యంతరం తెలియ చేస్తున్నారు.
ఇది భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని పేర్కొన్నారు. దీనిపై స్పందించ లేదు సబా నఖ్వీ.
Also Read : రేప్ లకు అడ్డాగా మారిన హైదరాబాద్