Sadhvi Pragya Thakur : నిజం చెబితే నేర‌మంటే ఎలా – ప్ర‌గ్యా

ఈ దేశం హిందువులదేనంటూ కామెంట్

Sadhvi Pragya Thakur : మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన నూపుర్ శ‌ర్మతో పాటు ఢిల్లీ బీజేపీ మీడియా ఇన్ చార్జ్ న‌వీన్ జిందాల్ ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసింది. ఆమె చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారి తీసింది. ఆమెతో పాటు దేశంలోని ప‌లువురిపై విద్వేష పూరిత ప్ర‌సంగాలు, వ్యాఖ్య‌లు చేశారంటూ ఢిల్లీ పోలీసులు కేసు న‌మోదు చేశారు. శుక్ర‌వారం దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌లో పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వ్య‌క్తం అయ్యాయి.

కొన్ని చోట్ల ఉద్రిక్త‌త కూడా చోటు చేసుకుంది. ఈ త‌రుణంలో నూపుర్ శ‌ర్మ‌ను భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ప్ర‌గ్యా ఠాకూర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సాధ్వి ప్ర‌గ్యా ఠాకూర్(Sadhvi Pragya Thakur) శ‌ర్మ‌కు త‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

నిజం చెప్ప‌డం తిరుగుబాటు అయితే ఆ నాణెం ద్వారా నేను కూడా తిరుగ‌బాటురాలినేనంటూ పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా మ‌రో కీల‌క కామెంట్ చేశారు. భార‌త దేశం హిందూవుల‌దేన‌ని స్ప‌ష్టం చేశారు.

స‌నాత‌న ధ‌ర్ం ఇక్క‌డే ఉంటుంద‌ని వేరే చోట ఉండ‌ద‌న్నారు. కొంద‌రు చంపుతామ‌ని బెదిరిస్తున్నారు. మ‌న దేవ‌త‌ల‌ను, దేవుళ్ల‌ను వ‌క్రీక‌రించి వారిపై సినిమాలు తీయ‌డం ఏళ్ల త‌ర‌బ‌డి చూస్తూనే ఉన్నాం.

కానీ మ‌నం ఎవ‌రం ప్ర‌శ్నించం. నిల‌దీయ‌మ‌ని మండిప‌డ్డారు. ఇది వారి మ‌న‌స్త‌త్వాన్ని సూచిస్తుంద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా క‌మ‌లేష్ తివారీ 18 అక్టోబ‌ర్ 2019లో ల‌క్నో లోని ఖుర్షీద్ బాగ్ ప‌రిస‌రాల్లో త‌న నివాసంలో క‌త్తి పోట్ల‌తో హ‌త్య‌కు గుర‌య్యాడ‌ని ఆవేద‌న చెందారు ప్ర‌గ్యా ఠాకూర్(Sadhvi Pragya Thakur).

Also Read : ప్ర‌వ‌క్త వ్యాఖ్య‌ల‌పై భారీ నిర‌స‌న‌

Leave A Reply

Your Email Id will not be published!