Nayanthara Vignesh : నయన్ దంపతులకు టీటీడీ నోటీసు
నోటీసులు జారీ..తప్పైందని క్షమాపణ
Nayanthara Vignesh : నయనతార, విఘ్నేష్ శివన్(Nayanthara Vignesh) దంపతులకు కోలుకోలేని షాక్ తగిలింది. పాదరక్షలతో తిరుమల మాడ వీధుల్లో నడిచిన నయనతారపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. స్వామి, అమ్మ వార్లను ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్న అనంతరం దర్శించుకున్నారు.
ఇదే సమయంలో ఈ ఇద్దరూ వివాదంలో చిక్కుకున్నాడు. ఇదిలా ఉండగా విఘ్నేశ్ శివన్ చెప్పులు విడిచినా నయన తార మాత్రం వాటితోనే
మాడ వీధుల్లో తిరిగింది.
ఇదే సమయంలో శ్రీవారి ఆలయం ప్రధాన ద్వారం పక్కనే ఫోటో షూట్ లో కూడా పాల్గొనడం వివాదానికి దారి తీసింది. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించడంపై భక్తులు పెద్ద ఎత్తున అభ్యంతరం తెలిపారు.
ఇదే విషయంపై తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చేస్తోందంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై సర్వత్రా నిరసన వ్యక్తం కావడంతో రంగంలోకి దిగింది.
ఈ మేరకు టీటీడీ నయనతార, విఘ్నేశ్ శివన్(Nayanthara Vignesh) దంపతులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నయన తార చెప్పులతో రావడం ముమ్మాటికీ తప్పని, క్షమించరాని నేరమని స్పష్టం చేసింది టీటీడీ.
తిరుమల ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరించిన నోటీసులు జార చేసినట్లు తెలిపింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమించమని వేడుకున్నట్లు వెల్లడించింది.
ఈ మేరకు నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులకు ఇచ్చిన నోటీసులో ఏం సమాధానం ఇస్తారనే దానిపై తాము తదుపరి చర్యలు తీసుకుంటామని టీటీడీ స్పష్టం చేసింది.
ఈ మేరకు ఈ వివాదాస్పద అంశంపై టీటీడీ చైర్మన్ , ఈవో కలిసి చర్చిస్తారని ఆ తర్వాత తదుపరి నిర్ణయం ప్రకటిస్తారని టీటీడీ వెల్లడించింది.
Also Read : శ్రీవారి సేవలో ‘దీపికా..ప్రకాష్’ పదుకొనె