Mamata Banerjee : 15న రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌పై దీదీ స‌మావేశం

విప‌క్షాల‌న్నీ ఏక‌తాటిపైకి రావాలి

Mamata Banerjee : త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌పై ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఏక‌తాటి పైకి రావాల‌ని పిలుపునిచ్చారు టీఎంసీ చీఫ్‌, సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ. దేశ రాజ‌ధాని ఢిల్లీలో సంయుక్త స‌మావేశం ఏర్పాటు ఏర్పాటు చేయాల‌ని సూచించారు.

ఇందుకు తాను రెడీగా ఉన్నాన‌ని తెలిపారు. ఈ మీటింగ్ కు ప్ర‌తిప‌క్షాల‌కు చెందిన ముఖ్య‌మంత్రులు హాజ‌రు కావాల‌ని కోరారు సీఎం. త్వ‌ర‌లో జూలై 18న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. 21న రిజ‌ల్ట్ రానుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర‌ప‌తి రేసులో ప‌లువురి పేర్లు ఉన్నాయి. కేంద్రంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ కు ప్రెసిడెంట్ ఎన్నిక అగ్నిప‌రీక్ష‌గా మారింది.

ఈ మేర‌కు ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరొందిన అమిత్ చంద్ర షా రంగంలోకి దిగిన‌ట్లు స‌మాచారం. తాజాగా అందిన స‌మాచారం మేర‌కు ప్రెసిడెంట్ ప‌ద‌వి రేసులో ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు,

రాజ్ నాథ్ సింగ్, త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ ఉండ‌గా కాంగ్రెస్ నుంచి గులాం న‌బీ ఆజాద్ , శ‌ర‌ద్ ప‌వార్ పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. ఇక ప్రాంతీయ పార్టీల త‌ర‌పున నితీష్ కుమార్ , న‌వీన్ ప‌ట్నాయ‌క్ , కేసీఆర్ పేర్లు ఉన్నాయి.

ఈ త‌రుణంలో మ‌మ‌తా బెన‌ర్జీ(Mamata Banerjee) పిలుపు ఇవ్వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఎంకే స్టాలిన్ , అన్నాడీఎంకే , నితీష్ కుమార్ కీల‌క పాత్ర పోషించ‌నున్నారు.

ఈనెల 15న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు న్యూఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల దృష్ట్యా కార్యాచ‌ర‌ణ పై చ‌ర్చించేందుకు హాజ‌రు కావాల‌ని పిలుపునిచ్చారు.

Also Read : బీజేపీ నిర్వాకం ప్ర‌జ‌ల‌కు శాపం – దీదీ

Leave A Reply

Your Email Id will not be published!