Mamata Banerjee : ఏక‌మ‌వుదాం ఎన్డీఏ అభ్య‌ర్థిని ఓడిద్దాం

పిలుపునిచ్చిన సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ

Mamata Banerjee : దేశంలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం మ‌రింత వేడెక్కింది. కేంద్ర స‌ర్కార్ పై నిప్పులు చెరుగుతూ వ‌స్తున్నారు టీఎంసీ చీఫ్‌, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ(Mamata Banerjee).

భార‌త దేశ అత్యున్న‌త ప‌ద‌విగా భావించే రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వీ కాలం ముగిసింది. ఈనెల 15న నోటిఫికేష‌న్ జారీ చేయ‌నుంది. జూలై 18న పోలింగ్ జ‌ర‌గ‌నుంది.

ఎన్డీఏకు రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి గెలిచే ప‌రిస్థితి లేదు. కావాల్సిన మెజారిటీ లేదు. ఈ త‌రుణంలో ఎన్డీఏకు షాక్ ఇవ్వాల‌ని పిలుపునిచ్చారు మ‌మ‌తా బెన‌ర్జీ(Mamata Banerjee). ఇందులో భాగంగా దేశంలోని 22 విప‌క్షాల‌కు ఆహ్వానం ప‌లికారు.

15న ఢిల్లీలో క‌లుద్దామ‌ని పిలుపునిచ్చారు. ఈ మేర‌కు లేఖ‌లు పంపించారు. విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీకి కూడా పిలుపునిచ్చారు.

ఇందులో భాగంగా ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్, డీఎంకే చీఫ్ , త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ తో భేటీ కానున్నారు. ఢిల్లీలోని కానిస్టిట్యూష‌న్ క్ల‌బ్ లో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు జ‌రుగుతుంద‌ని, అంతా రావాల‌ని కోరారు సీఎం.

మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, కేర‌ళ‌, ఒడిశా, తెలంగాణ‌, త‌మిళనాడు, జార్ఖండ్ , పంజాబ్ సీఎంలు, ప‌లు పార్టీల చీఫ్ ల‌తో పాటు ఇత‌ర సీనియ‌ర్లు కూడా హాజ‌రు కానున్నారు. భావ సారూప్య‌త క‌లిగిన పార్టీలు, నేత‌లు ఏకం కావాల‌ని పిలుపునిచ్చారు.

ఇదే స‌మ‌యంలో ఈడీ, సీబీఐ ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను కేంద్రం ప్ర‌యోగిస్తోందంటూ ఆరోపించారు. ఇదిలా ఉండ‌గా దీదీ పిలుపు ఇవ్వ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఏచూరి పేర్కొన్నారు.

Also Read : 15న రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌పై దీదీ స‌మావేశం

Leave A Reply

Your Email Id will not be published!