China Defence Minister : అమెరికా జోక్యాన్ని సహించం – చైనా
నిప్పులు చెరిగిన రక్షణ శాఖ మంత్రి
China Defence Minister : ఆసియా ఖండంలో మద్దతును హైజాక్ చేసేందుకు అమెరికా ప్రయత్నం చేస్తోందంటూ చైనా సంచలన ఆరోపణలు చేసింది. చైనా రక్షణ శాఖ మంత్రి(China Defence Minister) వీ ఫెంఘే కీలక వ్యాఖ్యలు చేశారు.
పెట్రోలింగ్ పేరుతో మా ప్రాంత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందంటూ మండిపడ్డారు. దక్షిణ చైనా సముద్రంలో విధ్వంసానికి యుద్ద నౌకలు, యుద్ధ విమానాలను పంపిస్తూ మరింత ఘర్షణకు దారి తీస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆసియా – పసిఫిక్ ప్రాంతం లోని దేశాల మద్దతును బీజింగ్ కు వ్యతిరేకంగా తిప్పి కొట్టేందుకు అమెరికా హైజాక్ చేసేందుకు యత్నిస్తోందంటూ రక్షణ శాఖ మంత్రి(China Defence Minister) ఫైర్ అయ్యారు.
బహుపాక్షికత ముసుగులో తన స్వంత ప్రయోజనాలను ముందుకు తీసుకు వెళ్లాలని కోరుతోందన్నారు వీ ఫెంఘే. ఈ సందర్భంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్ఏ) రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ పై విరుచుకు పడ్డారు.
షాంగ్రి లా డైలాగ్ లో చైనా తన స్వయం ప్రతిపత్తి కలిగిన తైవాన్ ద్వీపంపై అస్థిరతను కలిగిస్తోందంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇండో పసిఫిక్ లోని దేశాలతో బహు పాక్షిక భాగస్వామ్యాల ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు ఆస్టిన్.
ఇది చైనాను ఒక మూలకు చేర్చే ప్రయత్నమని వీ ఫెంఘే సూచించారు. ఏ దేశం తన ఇష్టాన్ని ఇతరులపై రుద్ద కూడదన్నారు. బెదిరించడం చేస్తూ చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు వీ ఫెంఘే.
ఇప్పటి వరకు తాము ఓపికతో ఉన్నామని కానీ అమెరికా హద్దులు దాటి ప్రవర్తిస్తోందంటూ మండిపడ్డారు.
Also Read : రష్యాతో ఆయిల్ కొనుగోలుకు సిద్దం – పీఎం