Assam CM : అస్సాం కౌన్సిల్ ఎన్నిక‌ల్లో బీజేపీ హ‌వా

ఇది మోదీ ప్ర‌భుత్వానికి ద‌క్కిన గౌర‌వం

Assam CM : అస్సాంలోని క‌ర్బీ అంగ్లాంగ్ అటాన‌మ‌స్ డిస్ట్రిక్ కౌన్సిల్ (కేఏఏడీసీ)కి జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 26 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగగా అన్నింట్లోనూ ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

మండ‌లిలో 26 స్థానాల‌తో పాటు న‌లుగురు నామినేటెడ్ స‌భ్యులు ఉన్నారు. ఇక మెజారిటీ సాధించాలంటే ఒక పార్టీ లేదా కూట‌మి 16 స్థానాలు లేదా అంత‌కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలి.

కాగా పూర్తి మెజారిటీని సాధించి జ‌య‌కేత‌నం ఎగుర వేసింది కాషాయ పార్టీ. ఇదిలా ఉండ‌గా కౌన్సిల్ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేయ‌డం ఇది వ‌రుస‌గా రెండోసారి కావ‌డం విశేషం.

ఈ గెలుపును తాము స్వీక‌రిస్తున్నామ‌ని పేర్కొన్నారు అస్సాం సీఎం హిమంత బిశ్వా శ‌ర్మ‌. ఈ మేర‌కు ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు.

వ‌రుస‌గా రెండవసారి కేఏఏసీ ఎన్నిక‌ల్లో అస్సాం బీజేపీకి చారిత్రాత్మ‌క‌మైన విజ‌యాన్ని అందించినందుకు క‌ర్బీ అంగ్లాంగ్ ప్ర‌జ‌ల‌కు శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్న‌ట్లు తెలిపారు.

ఈ భారీ విజ‌యానికి ప్ర‌ధాన కార‌ణం భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సార‌థ్యంలోని మెరుగైన పాల‌న‌కు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు హిమంత శ‌ర్మ‌.

ఇదిలా ఉండ‌గా భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌నితీరుకు ద‌క్కిన గౌర‌వంగా అభివ‌ర్ణించారు ఆ పార్టీ అస్సాం రాష్ట్ర ఇన్ చార్జ్ బై జ‌యంత్ పాండా. ప్ర‌ధాన మంత్రి మోదీ, అస్సాం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ(Assam CM) స‌మ‌ర్థ నాయ‌క‌త్వంలో ఇది సాధ్య‌మైంద‌న్నారు.

రాబోయే ఏ ఎన్నిక‌లైనా గెలుపొందడం ఖాయ‌మ‌న్నారు సీఎం.

Also Read : యూపీలో కూల్చివేతల‌పై ఓవైసీ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!