Rahul Priyanka Gandhi : రాహుల్ గాంధీకి తోడుగా ప్రియాంక
ఈడీ విచారణకు చేరుకున్న అన్నా చెల్లెళ్లు
Rahul Priyanka Gandhi : నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన సమన్లకు గాను సోమవారం రాహుల్ గాంధీ ర్యాలీగా బయలు దేరారు. దేశ రాజధాని ఢిల్లీ మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిండి పోయింది.
ఏఐసీసీ వద్ద సీనియర్ నాయకులు చేరుకున్నారు. ఆయా రాష్ట్రాలకు చెందిన సీఎంలు, మాజీ మంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర బాధ్యులు పాల్గొన్నారు.
దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి పక్కన పెట్టేందుకు ఇలాంటి కేసులు నమోదు చేస్తోందంటూ ఆరోపించారు మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్. ప్రస్తుతం మోదీ పాలన రాచరిక పాలనను తలపింప చేస్తోందని మండిపడ్డారు.
ఇప్పటికే కేసు కొట్టి వేశారని , కావాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ(Rahul Priyanka Gandhi) ని అక్రమంగా ఇరికించేందుకే ఈడీ ద్వారా కేసులు నమోదు చేయించిందని ఆరోపించారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ, ఇన్ కమ్ ట్యాక్స్ లను ఉపయోగించడం తప్ప మరొకటి కాదన్నారు. సత్యం, ధర్మం నిలిచే ఉంటుందని దానిని నిర్మూలించే సత్తా మోదీ సర్కార్ కు లేదన్నారు.
ఇదిలా ఉండగా ఈడీ నోటీసు అందుకున్న అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి తోడుగా ఉన్నారు చెల్లెలు ప్రియాంక గాంధీ(Rahul Priyanka Gandhi) . ఏఐసీసీ కార్యాలయం నుంచి కాలినడకన ర్యాలీగా ఈడీ ఆఫీసు వరకు బయలు దేరారు. రాహుల్ వెంట ఉన్నారు చెల్లెలు.
మూసి వేసిన కేసును తిరిగి నమోదు చేయడం అంటే కక్ష సాధింపు తప్ప మరొకటి కాదన్నారు. రాజకీయంగా లబ్ధి పొందుకే మోదీ, అమిత్ షా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
Also Read : ఈడీ విచారణకు ర్యాలీగా రాహుల్