Robert Vadra : కేసు అబద్దం సత్యం గెలవడం ఖాయం
రాహుల్ కు ఈడీ సమన్లపై కామెంట్
Robert Vadra : నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సోమవారం కాంగ్రెస్ నేత, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసు ఎదుట హాజరయ్యారు.
ఏఐసీసీ కార్యాలయం నుంచి పాదయాత్రగా బయలు దేరారు. రాహుల్ గాంధీ వెంట ఆయన చెల్లెలు ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా స్పందించారు ప్రియాంక భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా(Robert Vadra).
ఇదంతా కక్ష సాధింపు ధోరణి తప్ప మరొకటి కాదన్నారు. కోల్పోయిన మైలేజీని తిరిగి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి నిరాధారమైన కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.
ఇది పూర్తిగా విరుద్దమని పేర్కొన్నారు. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసును కొట్టి వేయడం జరిగిందన్నారు. కానీ కావాలని వేధింపులకు గురి చేయాలనే ఉద్ధేశంతోనే కేంద్ర సర్కార్ కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించిందని ఆరోపించారు.
దేశ ప్రజలకు ఎవరు ఎలాంటి వారనే విషయం తెలుసన్నారు. ఎన్ని నిరాధారమైన , అక్రమ కేసులు బనాయించినా చివరకు సత్యమే గెలుస్తుందన్నారు రాబర్ట్ వాద్రా. ఇది పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేపట్టారని తెలిపారు.
కేంద్రానికి కూడా ఈ కేసు నిలవదని తెలుసన్నారు. కాగా బీజేపీయేతర రాష్ట్రాలను, పార్టీలను టార్గెట్ చేసుకున్నాయంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఇదిలా ఉండగా శివసేన పార్టీ అధికార పార్టీ ప్రతినిధి సంజయ్ రౌత్ సంచలన కామెంట్స్ చేశారు. ఒక్కసారి తమకు ఈడీని అప్పగిస్తే ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు.
Also Read : రాహుల్ గాంధీకి తోడుగా ప్రియాంక