Smriti Irani : ఆస్తులు కాపాడుకునేందుకే ఈడీపై ఒత్తిడి
సోనియా గాంధీ ఫ్యామిలీపై స్మృతీ ఇరానీ
Smriti Irani : ఈ దేశంలో అవినీతి, అక్రమాలకు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ అని నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) . నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ముందు హాజరు కావడానికి రాహుల్ గాంధీ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.
అక్రమంగా సంపాదించిన రూ. 2,000 కోట్ల ఆస్తులను కాపాడు కునేందుకే ఇలాంటి నాటకాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. సోమవారం ఢిల్లీలో స్మృతి ఇరానీ మీడియాతో మాట్లాడారు.
నిజాయితీగా ఉన్నట్లయితే ఎందుకు ఇంత మందితో నిరసనలు, ఆందోళనలు చేపడతారంటూ ప్రశ్నించారు. నాయకులు, కార్యకర్తల పేరుతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సీరియస్ అయ్యారు కేంద్ర మంత్రి.
ఇదిలా ఉండగా సమాజానికి సేవ చేసేందుకు ఏర్పాటు చేసిన సంస్థ ఇప్పుడు గాంధీ కుటుంబ ప్రయోజనాలకే పరిమితమైందని స్మృతి ఇరానీ ఆరోపించారు.
కాగా రాహుల్ గాంధీకి సంఘీభావం తెలిపేందుకు కాంగ్రెస్ చేపట్టిన సత్యాగ్రహ యాత్రను తీవ్రంగా తప్పు పట్టారు. ఏం ఉద్దరించారని ఈ యాత్ర చేపడతారని ఆమె ప్రశ్నించారు.
దర్యాప్తు సంస్థలు అవినీతి, ఆరోపణలను బయటకు తీసుకు వచ్చాయి. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఎందుకు ఉలికి పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు స్మృతి ఇరానీ(Smriti Irani).
ఈడీపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చేందుకు రోడ్లపైకి వచ్చారంటూ ఎద్దేవా చేశారు. ఇది అక్రమ ఆస్తులను కాపాడుకునే ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నారు కేంద్ర మంత్రి.
1930లో 5,000 మంది స్వాతంత్ర సమరయోధులతో అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ ఏర్పడింది. సమర యోధులను కాపాడాల్సిన ఆ సంస్థను గాంధీ కుటుంబం లాక్కుందని ఆరోపించారు స్మృతి ఇరానీ.
Also Read : ఈడీ విచారణకు ర్యాలీగా రాహుల్