CEB Chairman : మోదీపై ఆరోప‌ణ‌లు ఉప‌సంహ‌ర‌ణ – సిఇబీ చీఫ్

ప్రాజెక్టు కాంట్రాక్ట్ అదానీకి అప్ప‌గింత‌పై కామెంట్

CEB Chairman : దేశ ప్ర‌ధాన మంత్రిపై శ్రీ‌లంక‌కు చెందిన విద్యుత్ సంస్థ చీఫ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ కామెంట్స్ అటు శ్రీ‌లంక‌లో ఇటు ఇండియాలో తీవ్ర క‌ల‌క‌లం రేపాయి.

శ్రీ‌లంక‌లోని 500 మెగావాట్ల పున‌రుత్పాద‌క ఇంద‌న ప్రాజెక్టు మ‌న్నార్ జిల్లాలో ఉంది. దీనిని త‌మ దేశానికి చెందిన గౌత‌మ్ అదానీ చైర్మ‌న్ గా ఉన్న అదానీ గ్రూప్ న‌కు ఇవ్వాలంటూ ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ త‌పై ఒత్తిడి తెచ్చారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఈ త‌రుణంలో ఆ వ్యాఖ్య‌ల్ని తాను ఉప‌సంహ‌రించు కుంటున్న‌ట్లు పేర్కొన‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసింది. ప్రధాని మోదీ నేరుగా శ్రీ‌లంక చీఫ్ గోట‌బ‌య రాజ‌ప‌క్సేపై ఒత్తిడి తెచ్చార‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

దీనిని ఆ దేశ ప్రెసిడెంట్ రాజ‌ప‌క్సె కూడా తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉండ‌గా శ్రీ‌లంక విద్యుత్ అథారిటీ చీఫ్ ఇప్పుడు ఉప‌సంహ‌రించుకున్న ఆరోప‌ణ‌ల‌పై ప్ర‌భుత్వం ఇంకా కామెంట్ చేయ‌లేదు.

కాగా శ్రీ‌లంక‌లోని సిలోన్ ఎల‌క్ట్రిసిటీ బోర్డు (సిఇబి) చైర్మ‌న్(CEB Chairman) ఎంఎంసీ ఫెర్డినాండో పార్ల‌మెంట‌రీ ప్యానెల్ తో మాట్లాడారు. ప‌వ‌న విద్యుత్ ప్రాజెక్టును నేరుగా అదానీ గ్రూప్ న‌కు ఇవ్వాల‌ని ప్ర‌ధాని మోదీ త‌నపై ఒత్తిడి తెచ్చారంటూ దేశ అధ్య‌క్షుడు రాజ‌ప‌క్సె త‌న‌తో చెప్పార‌ని అన్నారు.

ఇది తీవ్ర దుమారం రేగింది. ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసిన వీడియో క‌ల‌క‌లం రేపింది. క‌మ్యూనికేష‌న్ గ్యాప్ వ‌ల్ల ఇలా జ‌రిగిందంటూ రాజ‌ప‌క్సె పేర్కొన్నారు. మ‌న్నార్ ప‌వ‌న విద్యుత్ ప్రాజెక్టును ఏ వ్య‌క్తికి గానీ లేదా ఏ సంస్థ‌కు ఇచ్చే అధికారాన్ని ఎవ‌రికీ ఇవ్వ‌లేద‌న్నారు.

Also Read : అమెరికా జోక్యాన్ని స‌హించం – చైనా

Leave A Reply

Your Email Id will not be published!