Nitish Kumar : ఎవరైనా చరిత్రను ఎలా మారుస్తారు
అమిత్ షా కామెంట్స్ కు నితీష్ కౌంటర్
Nitish Kumar : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా చేసిన కామెంట్స్ పై సీరియస్ గా స్పందించారు బీహార్ సీఎం నితీష్ కుమార్(Nitish Kumar). ఎవరైనా చరిత్రను ఎలా మార్చగలరా అంటూ ప్రశ్నించారు.
ఈ దేశంలో గతంలో ఎన్నో సామ్రాజ్యాలు ఉన్నాయి. అయితే చరిత్రకారులు మొఘులలపై మాత్రమే ఫోకస్ పెట్టారంటూ షా పేర్కొన్నారు. దీనిపై
తీవ్ర అభ్యంతరం తెలిపారు సీఎం.
ఈ మధ్య బీజేపీతో సంబంధాలు తెగి పోయాయి. అమిత్ షా అలా అనడం తప్పేనన్నారు. చరిత్రలో కొన్ని మార్పులు చేయగలమేమో కానీ
పూర్తిగా మార్చలేమంటూ పేర్కొన్నారు.
ఈ విషయం తనకు అర్థం కావడం లేదన్నారు నితీష్ కుమార్. మిత్రపక్షమైన బీజేపీకి ఆయన చురకలంటించారు. చరిత్ర అంటే ఏమిటి. దానిని ఎవరు రూపొందిస్తారు.
ఎలా తయారు చేస్తారు. ఒక వేళ గతించిన చరిత్రను ఎవరైనా మార్చగలరా అన్న అనుమానం తనకు కలుగుతోందన్నారు. చరిత్రకారులు గతంలో అద్భుతమైన చరిత్రను విస్మరించారంటూ అమిత్ షా కామెంట్స్ చేయడం భావ్యం కాదన్నారు సీఎం.
చరిత్ర పుస్తకాలను మళ్లీ సందర్శించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు. భాష అనేది వేరే సమస్య. కానీ ఎవరైనా
సరే ప్రాథమిక చరిత్రను మార్చ లేరన్నారు.
చరిత్ర పుస్తకాలలో మొఘల్ లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటూ అమిత్ షా కామెంట్స్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నితీశ్ కుమార్(Nitish Kumar).
చరిత్రకారులు సరైన వాస్తవాలను రాయడం ప్రారంభిస్తే సత్యం ఉనికి లోకి వస్తుందని హోం శాఖ మంత్రి అమిత్ షా ఇటీవల పుస్తక ఆవిష్కరణలో వ్యాఖ్యానించారు.
Also Read : ఆస్తులు కాపాడుకునేందుకే ఈడీపై ఒత్తిడి