Presidential Election 2022 : రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ జారీ

గెజిట్ విడుద‌ల చేసిన ప్ర‌భుత్వం

Presidential Election 2022 : దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపుతున్న స‌ర్వోన్న‌త ప‌ద‌విగా భావించే రాష్ట్ర‌ప‌తిగా ఉన్న రామ్ నాథ్ కోవింద్ ప‌దవీ కాలం పూర్త‌యింది. దీంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఇప్ప‌టికే షెడ్యూల్ విడుద‌ల చేసింది.

ఈ మేర‌కు అధికారికంగా బుధ‌వారం రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు సంబంధించి గెజిట్ నోటిఫికేష‌న్ వ‌చ్చేసింది. ఇందుకు గాను ఈనెల 29వ తేదీ దాకా రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి పోటీ ప‌డే అభ్య‌ర్థుల‌కు చెందిన ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.

ఈ వ‌చ్చిన నామినేష‌న్ల‌ను జూన్ 30 వ‌ర‌కు ప‌రిశీలిస్తారు. ఇక వ‌చ్చిన నామినేష‌న్లు ఉప సంహ‌రించు కునేందుకు గాను వ‌చ్చే జూలై 2 చివ‌రి తేదీగా నిర్ణ‌యించింది ఈసీ. ఇక రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు(Presidential Election 2022) సంబంధించి పోలింగ్ జూలై 18న జ‌ర‌గ‌నుంది.

దేశంలోని పార్ల‌మెంట్ తో పాటు రాష్ట్రాల‌లోని అసెంబ్లీల‌లో పోలింగ్ కొన‌సాగుతుంది. జూలై 21న రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఫ‌లితాన్ని విడుద‌ల చేస్తుంది. ఈ మొత్తం ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను రాజ్య‌స‌భ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రుగుతుంది.

ఇక కొత్త‌గా ఎన్నిక‌య్యే రాష్ట్ర‌ప‌తి 25న ప్ర‌మాణ స్వీకారం చేస్తారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం ఉన్న రామ్ నాథ్ కోవింద్ ప‌ద‌వీ కాలం జూలై 24తో ముగుస్తుంది.

ఇదిలా ఉండ‌గా దేశంలో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక కోసం కేంద్రంలోని ఎన్డీఏ స‌ర్కార్, విప‌క్షాలు పావులు క‌దుపుతున్నాయి. బీజేపీ నుంచి వెంక‌య్య నాయుడు, త‌మిళి సై పేర్ల‌ను ప‌రిశీలిస్తున్నారు.

విప‌క్షాల నుంచి గులాం న‌బీ ఆజాద్, శ‌ర‌ద్ ప‌వార్, నితీశ్ కుమార్, కేసీఆర్ పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి.

Also Read : మోదీ స‌ర్కార్ కు కాంగ్రెస్ లీగ‌ల్ నోటీస్

Leave A Reply

Your Email Id will not be published!